తెలుగు న్యూస్  /  Lifestyle  /  Rose Sharbat A Refreshing Summer Drink Recipe To Quench Your Thirst

Rose Sharbat । వేసవిలో వేడివేడి టీ,కాఫీలకు బదులు చల్లచల్లని రోజ్ షర్బత్ తాగి చల్లబడండి!

HT Telugu Desk HT Telugu

23 March 2023, 17:29 IST

  • Rose Sharbat Recipe: వేసవి కాలంలో ఎండలకు తీవ్రంగా దాహం వేస్తుంది, అలసటగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని రిఫ్రెష్ చేసే డ్రింక్స్ తాగాలి. రోజ్ షర్బత్ రెసిపీ ఇక్కడ తెలుసుకోండి.

Rose Sharbat Recipe
Rose Sharbat Recipe (istock)

Rose Sharbat Recipe

Summer Drinks: షర్బత్ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు, ముఖ్యంగా వేసవి వచ్చిందంటే, షర్బత్ వంటి పానీయం కోసం నాలుక లపలపలాడుతుంది. ఎండలో అలసిన శరీరానికి చల్లటి షర్బత్ ఎంతో హాయినిస్తుంది, తడారిన గొంతును తడిపి దాహం తీరుస్తుంది. శరీరంలోని వేడిని సహజంగా తగ్గిస్తుంది, శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. నిమ్మకాయ, దోసకాయ, పుదీనా, కోకం మొదలైన పదార్థాలతో రుచికరమైన పానీయాలను ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

ఈ ఎండాకాలంలో కాఫీ, టీలకు బదులు షర్బత్ వంటి పానీయాలు తీసుకోవడం ఎంతో మేలు. అయితే అందులో ఎక్కువ చక్కెర, ఇతర స్వీటెనర్లను ఉపయోగించకూడదు. సహజమైన పదార్థాలతో చేసిన పానీయం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

మీకోసం ఇక్కడ రోజ్ షర్బత్ రెసిపీని అందిస్తున్నాం. మీ గొంతు ఎండిపోయినప్పుడు, ఈ వేసవిలో మీకు ఏదైనా చల్లగా తాగలనిపించినపుడు సులభంగా రోజ్ షర్బత్ చేసుకొని తాగేయండి, ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది.

Rose Sharbat Recipe కోసం కావలసినవి

  • 100 ml రోజ్ సిరప్
  • 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు
  • 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం
  • 7-8 ఐస్ క్యూబ్స్
  • 600 ml చల్లని నీరు

రోజ్ షర్బత్/ గులాబీ షర్బత్ తయారీ విధానం

  1. ముందుగా సబ్జా గింజలను నీటిలో నానబెట్టండి, ఈ లోపు రోజ్ సిరప్ సిద్ధం చేసుకోండి.
  2. ఒక గుప్పెడు తాజా గులాబీ పువ్వు రెమ్మలను తీసుకొని ఒక గిన్నె నీటిలో ఉడికించండి. మరొక గిన్నెలో చక్కెర, నీరు కలిపి చక్కెర పాకం తయారు చేయండి. చక్కెర పాకంలో ఉడికించిన గులాబీ నీరు ఫిల్టర్ చేసుకొని బాగా కలిపేస్తే రోజ్ సిరప్ రెడీ.
  3. ఇప్పుడు మెత్తగా నానబెట్టిన సబ్జా గింజలను వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకోండి.
  4. అందులో రోజ్ సిరప్, ఐస్ క్యూబ్స్, కోల్డ్ వాటర్ వేసి కలపండి, పై నుంచి నిమ్మరసం పిండుకోండి.

అంతే, రోజ్ షర్బత్ రెడీ. మీరు పార్టీ మూడ్ లో ఉంటే, నీటికి బదులు సోడా కలుపుకోవచ్చు.