తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Right Life Partner: కళ్యాణం కమనీయం.. సరైన జీవిత భాగస్వామిని ఇలా ఎంచుకోండి!

right life partner: కళ్యాణం కమనీయం.. సరైన జీవిత భాగస్వామిని ఇలా ఎంచుకోండి!

HT Telugu Desk HT Telugu

03 September 2022, 16:35 IST

    • ways to choose the right life partner: ఆలుమగల బంధం అధ్బుతమైన అనుబంధం, మధురమైన బాంధవ్యం. ఈ మూడు ముళ్ల బంధం కలకాలం ఆనందంగా సాగాలంటే జీవిత భాగస్వామి అర్ధం  చేసుకునేలా ఉండాలి. 
ways to choose the right life partner
ways to choose the right life partner

ways to choose the right life partner

జీవితంలో ప్రతి కష్టమైన మలుపులో మీకు తొడు అవసరం చాలా ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉన్పప్పుడే కష్టం అవలీలగా ఎదుర్కొవచ్చు. అయితే అలుమగల బంధం బాగుండాలంటే ఆ బంధం ముడిపడడం కంటే ముందే సరైన జీవిత భాగస్వామిని కనుగొనడం చాలా ముఖ్యం. పెళ్లికి ప్లాన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను ఆలోచించాల్సిందే. సరైన భాగస్వామి ఎంచుకోవడంలో గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

మీమ్మల్ని సులభంగా అర్థం చేసుకోవాలి

మీరు చెప్పే విషయాలను, బాధాలను అర్థం చేసుకోగల వ్యక్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒకరిమాటలకు మరొకరు గౌరవం ఇచ్చుకోవాలి. ఇలా మీ బంధంలో వచ్చే ఆటుపోట్లను అవలీలగా ఎదుర్కొవచ్చు. ఇలాంటి భాగస్వామి ఉన్నప్పుడు బంధం కలకలం కొనసాగుతుంది. మీకు కష్టాలు వచ్చినప్పుడు మీమ్మల్ని అర్ధం చేసుకోగల బాగస్వామి ఉన్నాడనే భరోసా వస్తోంది.

మీ ఆసక్తులను పంచుకునే వ్యక్తి

ఆసక్తులను పంచుకునే వ్యక్తిని ఎంచుకోవడం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవితాన్ని ఎవరితోనైనా గడపాలని నిర్ణయించుకుంటారో వారి ఆలోచనలు మీలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు సినిమా బఫ్ అయితే, మీరు సినిమాలను ఆస్వాదించే వారితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. ఇది మీ జీవితాన్ని ఆసక్తికరంగా మార్చుతుంది.

వయస్సు తేడా

మీ ఎంచుకునే భాగస్వామికి మీకు ఎంత వయసు అని చూసుకోవడం చాలా ముఖ్యం. ఏజీలో భారీ తేడా ఉంటే ఇద్దరి మనస్తత్వాలు ఓకేలా ఉండకపోవచ్చు. దీంతో పొరపచ్చాలు వచ్చి బంధం మధ్యలోనే విగిపోతుంది

ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఉండాలి

మీ పట్ల లేదా మీ కలలు/లక్ష్యాలు లేదా మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం లేని వారితో జీవితాన్ని స్పష్టంగా గడపలేరు. కాబట్టి, మీ జీవితాంతం మిమ్మల్ని గుర్తించే వ్యక్తిని ఎంచుకోండి.

కెరీర్ ప్రణాళిక ఉన్న వ్యక్తి ఎంచుకోవడం

చక్కటి ప్రణాళిక ఉన్న భాగస్వామి ఎంచుకోవడం వల్ల మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆచరణాత్మకంగా సంబంధంలో ఇతర విషయం చాలా ముఖ్యమైనది. మీ భాగస్వామికి భవిష్యత్తు ప్రణాళికలు లేనట్లయితే, మీరు వివాహ నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసి ఉంటుంది.

జీవిత భాగస్వామి కుటుంబం

జీవిత భాగస్వామి ఎంచుకునే విషయంలో అతి ముఖ్యమైన అంశం వారి కుటుంబ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలి. వారి ప్రభావం భాగస్వామిపై ఎంతవరకు ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ సరైందేనా? ఇతరులను ఎంత వరకు గౌరవిస్తారని విషయాలపై దృష్టి పెట్టాలి