Real Time Crop Management System : రియల్ టైమ్ క్రాప్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఏపీ టాప్
31 August 2022, 14:26 IST
- Real Time Crop Management System In AP : రియల్ టైమ్ క్రాప్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. సర్వే నంబర్ల ప్రకారం జరుగుతున్న పంటల గుర్తింపులో టాప్ లో ఉంది. కేంద్రం ఇటీవల ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ప్రతీకాత్మక చిత్ర
కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్ టైమ్ పంటల నిర్వహణ ద్వారా సర్వే నంబర్ల వారీగా జరుగుతున్న పంటల గుర్తింపులో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తున్న ఈ-క్రాప్ తో ఇది సాధ్యమైంది.
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ మాట్లాడుతూ.. ఏ పంట సాగు చేస్తారో నిర్ణయించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్ టైమ్ పంటల నిర్వహణ ద్వారా సర్వే నంబర్ల వారీగా జరుగుతున్న పంటల గుర్తింపులో ఏపీ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు.
జిల్లా వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు, మండల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరికిరణ్ మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలతో తెరపైకి వచ్చిన ఈ-క్రాప్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఈ-క్రాప్ అమలులో ఏపీని భాగస్వామిగా చేయడం గర్వించదగ్గ విషయమని, ఇన్‌పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, పంటల బీమా వంటి పథకాలన్నీ ఈ-క్రాప్ ప్రమాణాలుగా అమలవుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులందరికీ ఇ-కెవైసి (నో యువర్ క్రాప్) రిజిస్ట్రేషన్ ప్రారంభించాలి. ‘వైఎస్‌ఆర్ యంత్ర సేవ’ కింద కిసాన్ డ్రోన్‌ల మంజూరుకు రైతు సంఘాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్పింది.