PM Kisan KYC: ఒక్కరోజే గడువు.. ఆ పనులు వెంటనే చేయండి..!
PM Kisan KYC: ఆగస్టు నెల పూర్తవ్వడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన PM Kisan KYC కేవైసీ పూర్తిచేయడం తప్పసరి. రేపటితో ఈ గడువు ముగుస్తుండటంతో EKYC కింద ఫార్మాలిటీని పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
PM Kisan KYC: మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారులైతే ఇవాళే వీలైనంత త్వరగా PM Kisan KYC EKYCని పూర్తి చేయండి. ఈ పథకం అందుకోడానికి KYCని పూర్తి చేయడానికి ప్రభుత్వం విధించిన చివరి గడువు ఆగస్టు 31తో ముగుస్తుంది. e-KYC పూర్తి చేయనట్లయితే తదుపరి విడతకు సంబంధించిన నగదు రైతుల ఖాతాలో జమకాదు.
కేవైసీ పూర్తి చేయడానికి ఇంతకు ముందు సర్కార్ విధించిన గడువు తేదీ ఈ ఏడాది జూలై 31తో ముగిసింది. అయితే ఇంకా చాలా మంది లబ్దిదారులు కేవైసీ PM Kisan KYC కంప్లీట్ చేయలేదన్న ఉద్దేశ్యంతో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఇప్పటివరక కేవైసీ ఫార్మాలిటిస్ ను పూర్తి చేయని వారికి ఈ పథకం 11వ విడత నగదు అందలేదు. ఈ పథకం 12వ విడత నగదును సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం విడుదల చేసే ఛాన్స్ ఉంది.
pm kisan ekyc ఇలా చేయండి…
ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకుంటున్న రైతులు OTP బేస్డ్ ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్రం కోరింది. లేదంటే రైతులు వారి సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ విధానం ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చని కేంద్రం సూచిస్తోంది. ఆధార్ నెంబర్ సాయంతో ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేయించుకునే రైతులు ఈ కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి.
https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx. రైతులు పీఎం కిసాన్ వెబ్ సైట్లో కి వెళ్లి రైతులు అనే కార్నర్ ద్వారా ఈకేవైసీ ట్యాబ్ పై క్లిక్ చేయండి. రైతులు వారి ఆధార్ నెంబరును ట్యాబ్ లో నమోదు చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కు వచ్చే నాలుగు అంకెల డిజిట్ OTPని ఎంటర్ చేయండి.
ఆధార్ నెంబర్, ఓటీపీని అందించడం ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ కేవైసీ PM Kisan KYC పూర్తి చేసుకున్న రైతులకు రూ.2వేల రూపాయల ఇన్ స్టాల్ మెంట్ వారి అకౌంట్లో కేంద్రం జమ చేస్తుంది. 2019లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల కోసం ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద పది కోట్ల మంది రైతులకు రూ. 21, 000కోట్లను మే 31 వ తారీఖున వారి ఖాతాల్లో జమ చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు అలర్ట్…
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాదారులు అయితే ఆగస్టు 31లోపు కేవైసీని తప్పనిసరిగా కలిగి ఉండాలి. లేదంటే బ్యాంకు మీ ఖాతాను హోల్డ్ లో పెడుతుంది. బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ ద్వరా ఈ విషయాన్ని వెల్లడించింది. అకౌంట్ సంబంధించిన కేవైసీ ప్రక్రియను మార్చి 31, 2022నాటికి పూర్తి చేయని వినియోగదారులు ఆగస్టు 31, 2022లోపు చేయాలి. లేదంటే మీ అకౌంట్ డియాక్టివేట్ చేయబడుతుందని బ్యాంక్ ప్రకటించింది.