CBN Phone To Allu Arjun : హీరో అల్లు అర్జున్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
CBN Phone To Allu Arjun : హీరో అల్లు అర్జున్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. అరెస్టుపై ఆరా తీసిన సీఎం.. ధైర్యంగా ఉండాలని సూచించారు. నిన్న అల్లు అరవింద్ కు సీఎం చంద్రబాబు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.
CBN Phone To Allu Arjun : హీరో అల్లు అర్జున్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. నిన్న అల్లు అరవింద్ కు కూడా ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు.. ధైర్యంగా ఉండాలని సూచించారు. హీరో బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్ కూడా ఫోన్ లో అల్లు అర్జున్ ను పరామర్శించారు. అరెస్టుపై విషయాలను అడిగి తెలుసుకున్నారు.
బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ను టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు వరుసగా పరామర్శిస్తున్నారు. హీరోలు రానా, నాగ చైతన్య అల్లు అర్జున్ ను పరామర్శించారు.
అల్లు అర్జున్ కు రిటర్న్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా.. ఈ కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. శనివారం ఉదయం బెయిల్‌పై అల్లు అర్జున్ విడుదల అయ్యారు. దాంతో అల్లు అర్జున్ నివాసానికి ఉదయం నుంచి వరుసగా వెళ్తున్న టాలీవుడ్ హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు.. తమ మద్దతు ప్రకటిస్తూ భరోసాగా నిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు.
‘‘భారత్‌లోనే అతి పెద్ద స్టార్.. తెలంగాణ నివాసి అయిన అల్లు అర్జున్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ హిట్ కొట్టి తెలంగాణ రాష్ట్రానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ.. తెలంగాణ రాష్ట్రం అతడ్ని జైలుకి పంపించి అతి పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’’ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడే
హీరో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే అన్నారు. అయితే చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఆమె కుమారుడు ఇంకా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందన్నారు. టాలీవుడ్ కి కాంగ్రెస్‌కు విడదీయరాని బంధం ఉందన్నారు. స్టూడియోల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూములిచ్చిందన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినిమాను, కళలను ప్రోత్సహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సినిమా వాళ్లు, అల్లు అర్జున్‌పై తమ ప్రభుత్వానికి ఎందుకు కోపం ఉంటుందన్నారు. సినిమా వాళ్లపై కోపం ఉంటే దిల్ రాజును తామేందుకు ఛైర్మన్ చేస్తామని ప్రశ్నించారు.
సంబంధిత కథనం