Bachhala Malli trailer: అల్లరి నరేశ్ ఊరమాస్ ‘బచ్చల మల్లి’ ట్రైలర్ రిలీజ్.. గూస్ బంప్స్
Allari Naresh Bachhala Malli trailer: అల్లరి నరేశ్ నాంది చిత్రంతో తనలోని మాస్ యాంగిల్‌ను ప్రేక్షకులకి పరిచయం చేశాడు. ఇప్పుడు బచ్చలమల్లితో ఊర మాస్ లుక్‌లో నరేశ్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు.
సీనియర్ హీరో అల్లరి నరేశ్ నటించిన బచ్చలపల్లి మూవీ ట్రైలర్ శనివారం రిలీజైంది. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేశ్ సరసన అమృత అయ్యర్ నటించగా.. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. డిసెంబరు 20 (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్‌కాబోతోంది.
తుని ఏరియాలో జరిగిన ఘటన
అల్లరి నరేశ్ కెరీర్‌లో తొలిసారి ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ బచ్చలపల్లి కథ... తుని ప్రాంతంలో 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెప్తోంది. తనపై కమెడియన్ ముద్రని చెరిపేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అల్లరి నరేశ్.. నాంది సినిమాతో కొంత మేర ఆ ముద్రని చెరిపేసుకున్నారు. తాజాగా బచ్చలమల్లితో పూర్తిగా మాస్ హీరో అవతారంలోకి నరేశ్ వచ్చినట్లు కనిపిస్తోంది.
చెడు అలవాట్లు వదిలేశాక
చెడు అలవాట్లు.. అంతకు మించిన మూర్ఖత్వంతో ఉండే యువకుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే? ఎలా ఉంటుంది అనే కోణంలో ట్రైలర్‌ను చూపించారు. అయితే.. చివరికి ఆ అమ్మాయి ప్రేమని ఆ యువకుడు దక్కించుకున్నాడా? తన చెడు అలవాట్లు వదిలేసిన తర్వాత ఆ యువకుడికి ఎదురైన సమస్యలు? వంటివి బచ్చల మల్లి ట్రైలర్‌లో చూపించారు.
అల్లరి నరేశ్ సినిమాల్లో తొలిసారి మదర్ సెంటిమెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌లో కొన్ని సీన్స్ కంటతడి పెట్టించేలా ఉన్నాయి.