Daaku Maharaaj: డాకు మహారాజ్ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్.. మీసం మెలేసిన బాలయ్య
Daaku Maharaaj: బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ లిరిజ్ వీడియో రిలీజైంది. ఇందులో బాలయ్య ఛంబల్ ప్రాంతంలో.. ?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ నుంచి టైటిల్ సాంగ్ శనివారం రిలీజైంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 12న సంక్రాంతికి కానుగా థియేటర్లలోకి రాబోతోంది.
ఛంబల్ దోపిడీ కథ
రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఇటీవల టైటిల్ రిలీజ్ చేసిన డాకు మహారాజ్ టీమ్.. ఈరోజు టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయడం ద్వారా బాలయ్య లుక్‌తో పాటు కథ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది. 1980లో ఛంబల్ ఏరియాలోని దోపిడీ ముఠాకి సంబంధించిన కథ ఇది.
ఈరోజు మూవీలోని ‘ది రేజ్ ఆఫ్ డాకు’ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. తమన్ మాస్ బీట్స్‌తో అదరగొట్టేసినట్లు కనిపిస్తోంది. ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఛంబల్ ఏరియాలో దోపిడీకి సంబంధించి ఈ సాంగ్ మొత్తం సాగింది. ఆఖర్లో బాలయ్య మీసం మెలేస్తూ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు.
16 ఏళ్లు ముప్పుతిప్పలు
1980లో దాదాపు దశాబ్దన్నర పాటు పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ‘డాకు సింగ్’ బయోగ్రఫీనే ఈ డాకు మహారాజ్. ఇప్పటికే డాకు సింగ్‌పై సినిమాలు వచ్చాయి. అయితే.. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని డాకు సింగ్‌ను కొత్తగా చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్తోంది.
సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు
డాకు సింగ్‌కి మాస్ మహారాజా రవితేజ గాత్రదానం చేశారు. కథ, కథలోని పాత్రలను తన గొంతో రవితేజ పరిచయం చేయబోతున్నారు. సంక్రాంతికి ఇప్పటికే గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రేసులో ఉండగా.. ఈ రెండు సినిమాలో డాకు మహారాజ్ పోటీపడాల్సి ఉంది.