తెలుగు న్యూస్ / ఫోటో /
TDP Membership : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు.. టాప్‌లో రాజంపేట
- TDP Membership : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం సభ్యత్వాలు 73 లక్షలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో క్యాడర్, నాయకులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు సిటీ, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయి.

(1 / 5)
సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా.. నేటికి 73 లక్షలకు చేరింది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది. (@JaiTDP)
(2 / 5)
సభ్యత్వ నమోదు అంశాలను ఆ విభాగ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా..ఇందులో 85 వేల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పొందారు. ఇప్పటి వరకు జరిగిన నమోదులో 54 శాతం మంది కొత్త వారు సభ్యత్వం తీసుకున్నారు. (@JaiTDP)
(3 / 5)
సభ్యత్వ నమోదులో 1.18 లక్షలతో రాజంపేట మొదటి స్థానంలో ఉండగా, నెల్లూరు సిటీలో 1.06 లక్షలు, కుప్పంలో 1.04 లక్షలు, పాలకొల్లులో 1.02 లక్షలు, మంగళగిరిలో 90 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వ కార్యక్రమంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. (@JaiTDP)
(4 / 5)
సభ్యత్వ కార్యక్రమంతో పార్టీ బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తెలుగుదేశం సభ్యత్వం పొందే పరిస్థితి రావాలన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. (@JaiTDP)
ఇతర గ్యాలరీలు