CM Jagan : అప్పటి నుంచి ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రమైంది-cm jagan attend niti aayog governing council meeting in delhi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : అప్పటి నుంచి ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రమైంది

CM Jagan : అప్పటి నుంచి ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రమైంది

Anand Sai HT Telugu
Aug 07, 2022 06:40 PM IST

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయిందని సీఎం జగన్ అన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని చెప్పారు.

<p>సీఎం జగన్</p>
సీఎం జగన్

నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాల్లో ఆత్మ నిర్భర్‌ సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. వ్యవసాయరంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని.. రైతులను ఆదుకునేందుకు పథకాలు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్, ఉచిత పంటలబీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు లాంటివి ఎంతోగానో ఉపయోగపడుతున్నాయన్నారు.

'రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాలద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. డిజిటిల్‌ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎంయాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ద్వారా నిరంతరం పరిశీలన చేస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం.' అని సీఎం చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ పథకాల వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. పేదరికం పిల్లల చదువులకు అడ్డం కాకూడదని అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఏటా రూ.15వేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తున్నట్టుగా తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసినట్టు చెప్పారు. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిషు టూ తెలుగు డిక్షనరీలు ఇస్తున్నట్టుగా వెల్లడించారు.

మన బడి నాడు-నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తున్నట్టుగా తెలిపారు. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దామని, ఇందులో డిజిటల్‌ తరగతుల ఏర్పాటు కూడా పూర్తిచేస్తామన్నారు. ఇంగ్లిషు భాషకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని.. పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.

'ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. విద్యాదీవెన పథకం ద్వారా 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దాం. 1.6 లక్షలమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే ముందుకు వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. పౌరుల ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నాం. ప్రతి 50–100 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను కూడా నియమించాం.' అని వివిధ పథకాల గురించి.. నోట్‌ను సమర్పించారు.

Whats_app_banner