ఆ పనికి ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
30 December 2022, 9:56 IST
- సెక్స్ అనేది మానవ జీవితంలో (దాదాపు) ప్రతి ఒక్కరూ అనుభవించాలనుకునే ప్రత్యేక అనుభూతి. అయితే భాగస్వామితో క్రమం తప్పకుండా లైంగిక సంబంధం కలిగి ఉండటం వల్ల మానసిక స్థితి, సంబంధాలు మెరుగుపడతాయి అంటున్నారు. మరి నిర్దిష్ట వ్యవధిలో సెక్స్ చేయకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సెక్స్ ఎడ్యుకేషన్
Side Effects of Not Having Sex : సెక్స్ చేయకపోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా అంటే.. దానికి అవుననే అంటున్నారు నిపుణులు. అలా అని సెక్స్ చేయడమే పనిగా పెట్టుకోవాలని కాదు. కానీ కొందరు ఇతర కారణాలతో దీనికి దూరంగా ఉంటారు. అలాంటివారికి కొన్ని సమస్యలు ఉంటాయని చెప్తున్నారు. సెక్స్ లైఫ్ విషయంలో కచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ఏమి లేవు. కానీ.. ఎక్కువ కాలం సెక్స్ చేయకపోవడమనేది అవాంఛనీయమైనది కాదు. ఎందుకంటే సెక్స్‌లో పాల్గొనకపోవడం లేదా తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది శరీరం, మనస్సుపై దాని సొంత దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది అంటున్నారు నిపుణులు. వాస్తవానికి సెక్స్ ఫ్రీక్వెన్సీ అనేది.. అతని/ఆమె ప్రస్తుత వయస్సు, శారీరక దృఢత్వ స్థాయి, సెక్స్ డ్రైవ్, రిలేషన్ షిప్ స్థితిని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. లైంగిక సంయమనం లేదా శరీరాన్ని సెక్స్ చేయకుండా ఆపడం అనేది ఏ వ్యక్తికైనా మానసికంగా, శారీరకంగా ప్రతికూలతలను కలిగిస్తుంది.
సెక్స్ చేయకపోవడం వల్ల జరిగే శారీరక మార్పులు
క్రమరహిత లేదా తరచుగా సెక్స్‌లో పాల్గొనకపోవడం వల్ల.. లైంగిక ఆరోగ్య సమస్యలు, రుగ్మతలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది అంటున్నారు. ఉదాహరణకు పురుషులు ఎదుర్కొనే కొన్ని సాధారణ లైంగిక సమస్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* అంగస్తంభన లోపం
* అకాల స్ఖలనాలు
* హైపోయాక్టివ్ లైంగిక కోరిక
* రెట్రోగ్రేడ్ స్కలనం
* మూత్ర నాళాల ఇన్ఫెక్షన్
* ప్రోస్టేట్ రుగ్మతలు
మహిళలు ఎదుర్కొనే సాధారణ లైంగిక ఆరోగ్య సమస్యలు..
* యోని డ్రై అయిపోతుంది
* సంభోగం సమయంలో నొప్పి
* యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
* ఋతుస్రావం సమయంలో నొప్పి
* పెల్విక్ ఫ్లోర్ బలహీనత
* పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
ఇంకా.. లైంగిక కార్యకలాపాలు లేకపోవడం వల్ల మగ, ఆడ ఇద్దరూ అనుభవించే ఇతర సాధారణ శారీరక ఆరోగ్య సమస్యలు రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్ రుగ్మతలు, రక్త ప్రసరణలో అడ్డంకులు, నడుము సమస్యలు, అలసటను అనుభవిస్తారని నిపుణులు చెప్తున్నారు.
సెక్స్ చేయకపోవడం వల్ల కలిగే మానసిక ఇబ్బందులు..
సెక్స్ సమయంలో ఎండార్ఫిన్లు, అనేక ఇతర అనుభూతి-మంచి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒకరి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సెక్స్ లేకపోవడం వల్ల మానసిక కల్లోలం, అటువంటి హార్మోన్ల తక్కువ ఉత్పత్తి కారణంగా నిరాశ ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి హార్మోన్లు విడుదలైనప్పుడు.. మీకు మంచి నిద్ర వస్తుంది. లేదంటే.. మీకు నిద్ర సమస్యలు తప్పవనమాట.
తరచుగా సెక్స్ లేకపోవడం వల్ల నిద్రకు ఆటంకాలు, కొందరిలో ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు. అదనంగా ఎవరైనా చాలా సంవత్సరాలు లైంగిక సంయమనం పాటించనప్పుడు.. అది వారి రోగనిరోధక శక్తిని అణిచివేస్తుంది. తద్వారా త్వరగా అలసిపోతారు. ఏ పని చేసినా ఒత్తిడిని అనుభవిస్తారు. మీరు ఓ సంబంధంలో ఉన్నప్పుడు.. మీ భాగస్వామితో క్రమం తప్పకుండా సెక్స్ చేయకపోవడం వల్ల ఇద్దరూ అసురక్షితంగా, ఆత్రుతగా వ్యవహరిస్తారు.
చివరి మాట
ప్రజలు అనేక కారణాల వల్ల సెక్స్‌కు దూరంగా ఉండవచ్చు. ఉదాహరణకు వారు బలమైన సెక్స్ డ్రైవ్ కలిగి ఉండకపోవచ్చు. లేదా వారు అలైంగికంగా ఉండవచ్చు. లేదా వారు దానిలో పాల్గొనకూడదని ఫిక్స్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ.. అసంకల్పిత కారణాల వల్ల లైంగిక సంయమనం సంభవించినప్పుడు.. అతను/ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం, మెరుగైన జీవనశైలిని అనుసరించడం వంటివి మీకు చాలా వరకు సహాయపడతాయి. అయినప్పటికీ మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే వైద్యులను సంప్రదించడం మంచిది.