తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sex During Periods : పీరియడ్స్ సమయంలో సెక్స్​లో పాల్గొనవచ్చట.. కానీ ఆ జాగ్రత్తలు తప్పనిసరి..

Sex During Periods : పీరియడ్స్ సమయంలో సెక్స్​లో పాల్గొనవచ్చట.. కానీ ఆ జాగ్రత్తలు తప్పనిసరి..

30 September 2023, 21:20 IST

    • Sex During Periods: పీరియడ్స్ సమయంలో మహిళలకు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో వారు హార్నీ ఫీల్​ కూడా కలిగి ఉంటారని ఎక్కువ మందికి తెలియదు. పీరియడ్స్ అనేది తప్పు అన్నట్లు చూసే వారు ఉన్నారు కాబట్టి.. ఈ కోరికలు తప్పు అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. ఇంతకీ ఆ టైమ్‌లో సెక్స్​లో పాల్గొనవచ్చా? లేదా?
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేసుకోవచ్చా?
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేసుకోవచ్చా?

పీరియడ్స్ సమయంలో సెక్స్ చేసుకోవచ్చా?

Sex During Periods :పీరియడ్స్ సమయంలో సెక్స్ అనేది ఓ అద్భుతమైన అనుభూతి. ఆ రోజుల్లో నాకు హార్నియర్‌గా అనిపిస్తుంది. పీరియడ్స్ బ్లడ్ స్మెల్ గురించి ఎలాంటి ఆందోళన లేకుండా.. మీ భాగస్వామి కూడా అందులో పాలుపంచుకున్నప్పుడు అది ఒక అందమైన అనుభూతినిస్తుంది. నాకు పీరియడ్ సెక్స్ అనేది రిలాక్సింగ్. అంతేకాదు నా పార్ట్‌నర్‌తో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఇదొక మార్గం.

అపూర్వ (25).”

పీరియడ్స్ సమయంలో సెక్స్ గురించి ఓ యువతి చెప్పిన సమాధానం ఇది. ఇలా మీకు కూడా చాలా ప్రశ్నలే ఉండి ఉంటాయి. పీరియడ్స్ సమయంలో సెక్స్ సురక్షితమేనా? అసలు సెక్స్​లో పాల్గొనవచ్చా? నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఇలా చాలా ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. దీని గురించి ఎవరిని అడిగినా.. బాగోదు అని కొందరు వారిలోనే సతమవుతూ ఉంటారు. కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే లూబ్రికేషన్ అవసరం తక్కువగా ఉంటుంది. ఇది తిమ్మిరి, నొప్పి వంటి పీరియడ్స్-సంబంధిత లక్షణాలనుంచి ఉపశమనం ఇస్తుంది.

గైనకాలజిస్టులు కూడా పీరియడ్ సెక్స్ పూర్తిగా సురక్షితమైనదని, పరిశుభ్రమైనదిగా అంగీకరిస్తున్నారు. వారు ఎందుకు అలా అంటున్నారో ఇప్పుడు చుద్దాం. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చాలా మంది సెక్స్ ఆలోచనతో బాధపడుతుంటారు. కానీ అది సాధ్యం కాదని భావిస్తారు. ఇంతకీ ఈ ప్రశ్నలకు చెక్ పెడుతూ గైనకాలజిస్టులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో కూడా సురక్షితంగా సెక్స్​లో పాల్గొనవచ్చు అంటున్నారు. వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయంటున్నారు. పీరియడ్ సెక్స్ అనేది ఋతుస్రావంలో ఓ అంశం మాత్రమే. ఆ సమయంలో ఆ కోరికలు రావడం సహజమే. అది తప్పేమి కాదు. అయితే ఆ విషయంలో మీరు అసహ్యన్ని పక్కనపెట్టేయాలి. కొందరు రుతుక్రమం గురించి మూఢనమ్మకాలు ఎక్కువగా విని ఉంటారు. అందుకే వారు ఆ సమయంలో వెనుకాడుతారు. మరి కొందరు పీరియడ్స్ సెక్స్ కారణంగా యోనిలో ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని భయపడతారు. మరికొందరు తమ బెడ్‌షీట్‌లపై రక్తంతో మరకలు పడిపోవడం గురించి ఆందోళన చెందుతారు.

“తగినంత జాగ్రత్తలు తీసుకుంటే పీరియడ్ సెక్స్ సురక్షితం. లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడానికి సరైన గర్భనిరోధకాన్ని ఉపయోగించడం ద్వారా.. మహిళలు తప్పకుండా దానిని ఆస్వాదించగలరు” అని ప్రసూతి, గైనకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రీతి భదౌరియా తెలిపారు.

ఆ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు

పీరియడ్స్ సమయంలో యోని ద్రవం pH తక్కువ ఆమ్లంగా మారుతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ వాజినోసిస్ ప్రమాదం పెంచుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో మహిళలు కొన్ని ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతారు. అదనంగా పీరియడ్స్ సమయంలో గర్భాశయం కొద్దిగా తెరిచి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇదే కాకుండా గర్భం, లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి పీరియడ్ సెక్స్‌ను ఆస్వాదిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* అవాంఛిత గర్భధారణను నివారించడానికి.. సమర్థవంతమైన గర్భనిరోధకం క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది.

* మీరు ఇతర గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నప్పటికీ (మగ/ఆడ) కండోమ్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ఎందుకంటే ఇతర జనన నియంత్రణ పద్ధతులు నిరోధించలేని లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడంలో ఇవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

* టాంపోన్‌ను ఉపయోగిస్తుంటే.. లైంగిక సంపర్కానికి ముందు దాన్ని తీయాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే అది యోనిలోకి మరింత వెళ్లి.. తర్వాత తొలగించడం కష్టమవుతుంది. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే చాలు. మీ పీరియడ్స్‌లో సెక్స్ చేయడం వల్ల ఎటువంటి హాని ఉండదు అంటున్నారు గైనకాలజిస్టులు.