Sonam Kapoor: గర్భం దాల్చడం అన్ని సార్లు అందంగా ఉండదు.. ప్రతి రోజూ కష్టమే: సోనమ్
గర్భధారణ అన్నిసార్లు అందంగా ఉండదని సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది. 2018లో ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న సోనమ్.. త్వరలో తాను తల్లి కాబోతున్నానని ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది.
గర్బం దాల్చాలని ప్రతి ఒక్క మహిళల ఎన్నో కలలు కంటుంది. తల్లి కావాలని, తన పిల్లలతో అమ్మ అని అనిపించుకోవాలని ఆరాటపడుతుంది. ఇందుకోసం గర్భదారణ సమయంలో ఎన్నో కష్టాలను ఆనందంగా అనుభవిస్తుంది. సెలబ్రెటీ నుంచి సామాన్యుల వరకు ప్రతి స్త్రీ ఈ అనుభూతిని పొందాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అయితే బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఈ విషయంపై స్పందించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. గర్భం దాల్చడం అన్నిసార్లు అందంగా ఉండదని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది.
ఈ విధంగా సోనమ్ తన ప్రెగ్నెన్సీ గురించి పోస్టులు పెట్టడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా తన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది.
2018లో ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న సోనమ్.. త్వరలో తాను తల్లి కాబోతున్నానని ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. అందుకే అప్పటి నుంచి ఇంటి నుంచే వ్యాయామాలు గట్రా చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తోంది. "జూన్‌లో అబుజానీ సందీప్ ఖోస్లా ఫొటోషూట్‌లో పాల్గొన్న సోనమ్ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. మాృతృత్వపు శిఖరాగ్రం అంచున, నా పుట్టిన రోజు నేను ఎలా భావిస్తున్నాలో అలాంటి దుస్తులను ధరించాలని నేను ఎంచుకుంటున్నాను. గర్భం దాల్చడం శక్తిమంత, బోల్డ్ అండ్ బ్యూటీఫుల్" అని సోనమ్ స్పష్టం చేసింది.
గర్బం దాల్చిన ప్రారంభ వారాల్లో చాలా కష్టంగా ఉంటుందని గతంలో సోనమ్ పోస్ట్ పెట్టింది. "ప్రెగ్నెన్సీ ఎంత కష్టంగా ఉంటుందో ఎవ్వరూ హెచ్చరించరు. కానీ అది కష్టం. ప్రతి వారం, ప్రతిరోజూ మీ శరీరం పరిణామం చెందుతుంది. అంతేకాకుండా మీరు కొత్త అనుభూతులను కలిగి ఉంటారు. బాత్రూమ్‌కు వెళ్లాలి కాబట్టి నేను కొన్నిసార్లు నిద్రపోలేను. కొన్నిసార్లు 10 నుంచి 12 గంటల పడుకుంటాను. నన్ను ఎవ్వరూ లేపలేరు. నేను సాధారణంగా త్వరగా లేస్తాను. కానీ ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాను." అని ఆమె స్పష్టం చేసింది.
వర్క్ విషయానికొస్తే సోనమ్ బ్లైండ్ అనే సినిమాలో చేస్తోంది. సుజోయ్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు. పూరబ్ కోహ్లీ, వినయ్ పఠాన్, లిలైట్ డుబే తదితర చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్