తెలుగు న్యూస్  /  Lifestyle  /  Kodak Matrix Qled Tvs Go On Sale During Flipkart Big Billion Days Sale, Check Price

Kodak Matrix QLED TV । ఫ్లిప్‌కార్ట్‌లో కొడాక్ టీవీలు, బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో విక్రయాలు!

HT Telugu Desk HT Telugu

15 September 2022, 23:06 IST

    • కొడాక్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి సరికొత్తగా Kodak Matrix QLED TV సిరీస్ లో మూడు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటి ధరలు రూ. 34 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.
Kodak Matrix QLED TV
Kodak Matrix QLED TV

Kodak Matrix QLED TV

టెక్నాలజీ కంపెనీ Kodak ఇటీవల భారత మార్కెట్లో Matrix QLED TV సిరీస్‌ను విడుదల చేసింది. స్క్రీన్ పరిమాణాల ఆధారంగా కొత్త మ్యాట్రిక్స్ QLED TV సిరీస్ టీవీలు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా బేస్ మోడల్ 50-అంగుళాలు, మిడ్- రేంజ్ మోడల్ 55-అంగుళాలతో రాగా, టాప్ స్పెక్ మోడల్ 65-అంగుళాలతో విడుదలైంది. వీటి ధరలు రూ. 34 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.

భారతదేశంలో తమ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని Google TV సహాకారంతో కొడాక్ కంపెనీ ఈ స్మార్ట్ టీవీల లాంచ్‌ను చేపట్టింది. ఈ టీవీలలో DTS TruSurround, 1.1 బిలియన్ రంగులతో కూడిన QLED 4K డిస్‌ప్లే, Dolby MS12, HDR 10+ 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వంటి ప్రీమియం రేంజ్ ఫీచర్లు ఉన్నాయి.

కొడాక్ మ్యాట్రిక్స్ QLED సిరీస్ టీవీలు బెజెల్-లెస్, ఎయిర్ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. మూడు మోడల్‌లలో 40 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే డాల్బీ ఆడియో బాక్స్ స్పీకర్‌లు ఉన్నాయి.

అంతేకాకుండా ఈ Kodak TVలలో Google అసిస్టెంట్‌తో, Chromecast వీడియో మీటింగ్స్, డాక్యుమెంట్‌లు, YouTube లెర్నింగ్, Google క్లాస్‌రూమ్ కోసం ప్రత్యేకమైన ఇన్-బిల్ట్ యాప్‌లను అందిస్తోంది.

Kodak Matrix QLED TV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 4K వీడియో క్వాలిటీ అందించే 50/55/60 అంగుళాల QLED డిస్‌ప్లే
  • డాల్బీ విజన్, HDR 10+
  • 2 GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్
  • MT9062 ప్రాసెసర్
  • Google TV OS
  • 40 Watts డాల్బీ ఆడియో బాక్స్
  • Google అసిస్టెంట్- టీవీ రిమోట్

Kodak Matrix QLED TV లైనప్ ధరలు, లభ్యత

Kodak Matrix QLED TV, 50-అంగుళాల మోడల్ ధర రూ. 33,999/-

Kodak Matrix QLED TV, 55-అంగుళాల మోడల్ ధర రూ. 40,999/-

Kodak Matrix QLED TV, 65-అంగుళాల మోడల్ ధర రూ. 59,999/-

ఈ మూడు మోడల్‌లు బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.