Acer smart TV: తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కావాలా? అయితే ఈ టీవీలపై ఓ లుక్కేయండి!
Acer H-series, S-series televisions: ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీల కొనగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా Acer రెండు స్మార్ట్ టీవీలను ప్రారంభించారు. Acer H, S-సిరీస్‌లను ఈ టీవీలను పరిచయం చేసింది.
Acer రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. కంపెనీ దేశంలో Acer H, S-సిరీస్ టెలివిజన్‌లను పరిచయం చేసింది. Dolby Atmos, Dolby Vision, MEMC టెక్నాలజీ వంటి ఫీచర్లతో ఈ టీవీలు లాంచ్ చేయబడ్డాయి. ఈ టీవీలు హై-ఫై ప్రో ఆడియో సిస్టమ్‌తో వస్తాయి. H సిరీస్, S సిరీస్‌లోని అన్ని స్మార్ట్ టీవీలు ఫ్రేమ్‌లెస్, మెటల్ ఫినిషింగ్, షెల్ బాడీ ఫినిషింగ్‌తో వస్తాయి.
కొత్త Acer H-సిరీస్ టీవీలు S-సిరీస్ కంటే ఎక్కువ ప్రీమియం కూడినవి. H-సిరీస్‌లో 55-అంగుళాల, 50-అంగుళాల, 43-అంగుళాల మూడు వేర్వేరు సైజ్ టీవీలు ఉన్నాయి. ఇక S-సిరీస్‌లో 65-అంగుళాల, 32-అంగుళాల పరిమాణం గల టీవీలను చూడవచ్చు. టాప్-ఎండ్ వేరియంట్‌లు, మంచి సౌండ్ అనుభవం కోసం ప్యానెల్ దిగువన సౌండ్‌బార్‌ను యాడ్ చేశారు. టాప్ 65-అంగుళాల S-సిరీస్ మోడల్‌లో 50W హైపవర్ సౌండ్‌బార్ ఉంది, అయితే H-సిరీస్‌లో హై-ఫై ప్రో స్పీకర్స్ ఉన్నాయి.అన్ని H-సిరీస్, S-సిరీస్ మోడల్‌లు ఫ్రేమ్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.
Acer TV ధరలు
కొత్త సిరీస్ టీవీ ధరల మోడల్‌లను బట్టి ఉన్నాయి. Realme, OnePlus, Xiaomiతో పోటీ పడతున్నాయి. Acer కొత్త టీవీల ధరను తెలుసుకుందాం:
32-అంగుళాల HD TV - రూ. 14,999
43-అంగుళాల 4K TV - రూ. 29,999
50-అంగుళాల 4K TV - రూ. 34,999
55-అంగుళాల 4K TV - రూ. 39,999
65-అంగుళాల 4K TV - రూ. 64,999
ఈ టీవీలను తాజా పండుగ సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అనేక ఇతర సైట్‌లలో భారీ తగ్గింపులతో లభిస్తాయి. Acer టెలివిజన్స్ భారతదేశం అంతటా 4,000 పైగా రిటైల్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది, ఇక్కడ కొత్త టీవీలను సేల్ చేస్తుంది.
Acer TV స్పెసిఫికేషన్లు
కొత్త Acer TV మెటల్ ఫినిషింగ్‌తో వస్తుంది. టీవీలు డాల్బీ విజన్, డాల్బీ ఆడియోకు సపోర్ట్‌తో వస్తాయి, కొత్త టీవీలు MEMC (మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్) టెక్నాలజీకి కూడా సపోర్ట్ ఇస్తాయి. ఎక్కువ గంటలు టీవీ చూసిన కళ్ళకు హాని కలిగకుండా ఉండానికి ప్యానెల్ బ్లూ లైట్ తగ్గింపును కలిగి ఉంది. HLG, సూపర్ బ్రైట్‌నెస్, బ్లాక్ లెవెల్ ఆగ్మెంటేషన్, 4K అప్‌స్కేలింగ్, 2-వే బ్లూటూత్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fiతో కూడిన HDR10కి ఈ టీవీ సపోర్ట్ చెస్తుంది.
సంబంధిత కథనం