తెలుగు న్యూస్  /  Lifestyle  /  Key Tips To Plan A Perfect Destination Wedding

Destination wedding: డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

HT Telugu Desk HT Telugu

02 January 2023, 15:50 IST

    • Destination wedding: డెస్టినేషన్ వెడింగ్స్ బాగా పాపులర్ అయిన ఈ రోజుల్లో మీరూ దానిని కోరుకుంటే ఈ టిప్స్ పాటించండి.
చక్కటి ప్లానింగ్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు తక్కువ వ్యయం
చక్కటి ప్లానింగ్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు తక్కువ వ్యయం (pexels)

చక్కటి ప్లానింగ్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు తక్కువ వ్యయం

డెస్టినేషన్ వెడింగ్స్ కాస్త వ్యయంతో కూడుకున్నవే. అయితే తెలివిగా ప్లాన్ చేస్తే, క్రియేటివ్‌గా ఆప్షన్ ఎన్నుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు. మీ బడ్జెట్‌లోనే ఒక మధురమైన అనుభూతి మూటగట్టుకోవచ్చు. సుందరమైన వేదిక వద్ద స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఉల్లాసభరితమైన కబర్లతో జరుపుకునే వేడుకను ఏ జంట కోరుకోదు చెప్పండి? డెస్టినేషన్ వెడింగ్ కామన్ అయిపోయిన ఈరోజుల్లో ఈ ఆశ నెరవేర్చుకోవడం ఇప్పుడు సులువైంది. డెస్టినేషన్ వెడింగ్స్ చాలా ప్రాచుర్యం పొందడమే కాకుండా, రొమాంటిక్ ఈవెంట్స్‌గా మారిపోయాయి. మరి డెస్టినేషన్ వెడింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

విందమ్ హోటల్స్, రిసార్ట్స్ రీజనల్ డైరెక్టర్ నిఖిల్ శర్మ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘డెస్టినేషన్ వెడింగ్స్ కోసం ఎక్కువగా సుదూర, మారుమూల ప్రాంతాలను ఎంచుకుంటారు. అలాంటప్పుడు వెడింగ్ ప్లానింగ్, కేటరింగ్, ఇతర అంశాలు కాస్త సంక్లిష్టంగా ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా, ప్రతి చిన్న అంశాన్ని కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి. ఈ విషయాల్లో వెడ్డింగ్ ప్లానర్ మీకు సహాయకారిగా ఉన్నప్పటికీ, మీ ప్రాధాన్యాతలకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగేలా చూసుకోవడం అవసరం. అతిథులకు ఆహ్లాదకరమైన అనుభవం కోసం ఈ జాగ్రత్తలు తప్పవు.

1. Plan your budget: బడ్జెట్ ప్లాన్ చేయండి

డెస్టినేషన్ వెడ్డింగ్స్ మీ బడ్జెట్‌పై తప్పకుండా ప్రభావం చూపుతాయి. అందువల్ల అవి ఎప్పుడూ మీ బడ్జెట్ మించకుండా చూసుకోవాలి. ప్రతి వెండార్, వారి ధరలు పోల్చి చూసుకోవాలి. రవాణా, వసతి, ఎంటర్‌టైన్మెంట్ వంటి ఖర్చులన్నీ బేరీజు వేసుకోవాలి. వేడుకలో అన్ని ఈవెంట్లకు అయ్యే ఖర్చును అంచనా వేయడం మరవొద్దు.

2. guest list and choose the venue: అతిథుల జాబితా, వేదిక

డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఎంతమంది అతిథులు వస్తారో అంచనా ఉంటే మీ ప్లానింగ్ సులభమవుతుంది. అలాగే వివాహ మహోత్సవంలో ఉండే వేడుకలకు అనుగుణంగా తగిన వేదిక ఎంచుకోవడం మంచిది. మన దేశంలో డెస్టినేషన్ వెడింగ్స్ కోసం చాలా హోటళ్లు, రిసార్టులు సిద్ధంగా ఉంటున్నాయి.

3. appointments: అపాయింట్‌మెంట్స్ ఫిక్స్ చేయండి

మేకప్ ఆర్టిస్ట్, టాక్సీ సర్వీసెస్, స్టైలిస్ట్ వంటి సేవలన్నీ షెడ్యూలు ప్రకారం బుక్ చేసుకోండి. వెడ్డింగ్ సమయానికి ఒక నెల ముందే బుక్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. అలాగే కొన్ని రోజుల ముందు ఒకసారి రిమైండ్ చేయడం మంచిది.

4. wedding invitations on time: ముందస్తుగా ఇన్విటేషన్ పంపండి

డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు అతిథులు రావాలంటే వారికి తగినంత వ్యవధి ఉండేలా ముందస్తుగానే ఇన్విటేషన్స్ పంపండి. ఈ డిజిటల్ టెక్నాలజీ యుగంలో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ పాపులర్ అయిపోయాయి. స్వయంగా వెళ్లి ఇచ్చేందుకు సమయం లేని వారికి ఇది మంచి ఆప్షన్.

5. రవాణా చాలా కీలకం

వివాహ వేదికకు కొద్ది రోజుల ముందే అయితే విమాన ఛార్జీలు, రైలు ఛార్జీలు తడిసి మోపెడవుతాయి. అందువల్ల కనీసం 30 రోజుల ముందు బుక్ చేసుకునే అవకాశం ఉంటే చూడండి. అలాగే అతిథుల అవసరాలను గుర్తించి వారికి కూడా టికెట్స్ బుక్ చేయడం మరిచిపోవద్దు.

టాపిక్