తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ivoomi Jeetx । 200 కిమీ రేంజ్ కలిగిన హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదిగో!

iVoomi JeetX । 200 కిమీ రేంజ్ కలిగిన హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదిగో!

HT Telugu Desk HT Telugu

23 August 2022, 18:23 IST

    • EV మేకర్ iVoomi ఎనర్జీ మార్కెట్లో JeetX సిరీస్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. 200 కిమీ రేంజ్ కలిగి ఉన్న ఈ స్కూటర్ ధరలు రూ. 99,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. మిగతా వివరాలు చూడండి.
iVoomi JeetX
iVoomi JeetX

iVoomi JeetX

దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు iVoomi ఎనర్జీ తాజాగా JeetX అనే ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా మేడ్-ఇన్- ఇండియా, RTO రిజిస్టర్డ్, ARAI సర్టిఫైడ్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ JeetX అలాగే JeetX 180 అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. JeetX ఎకో మోడ్‌లో పూర్తి ఛార్జ్‌పై 100 కి.మీలకు పైగా ప్రయాణ పరిధిని అందిస్తుండగా రైడర్ మోడ్‌లో దాదాపు 90 కి.మీల పరిధిని అందిస్తుంది. అయితే JeetX180 వేరియంట్ సామర్థ్యం మరింత ఎక్కువగా ఉంటుంది. JeetX180 ఎకో మోడ్‌లో 200 కి.మీలకు పైగా రేంజ్ కలిగి ఉండగా, స్పోర్ట్స్ మోడ్‌లో దాదాపు 180 కి.మీల పరిధిని కవర్ చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్టం వేగం గంటకు 70 కి.మీ

సరికొత్త iVoomi JeetX స్కార్లెట్ రెడ్, ఇంక్ బ్లూ, పోష్ వైట్, స్పేస్ గ్రే అనే నాలు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.

బ్యాటరీ సెటప్

JeetX సిరీస్ ఇ-స్కూటర్ డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారులు డ్యూయల్ బ్యాటరీ కాన్ఫిగరేషన్‌ని ఉపయోగించి వారి వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవటం ద్వారా ఈ స్కూటర్ ప్రయాణ పరిధిని పెంచుకోవచ్చు.

ధరలు, బుకింగ్ సంబంధించిన వివరాలు

iVOOMi JeetX వేరియంట్‌ను బట్టి రూ. 1 లక్ష నుండి రూ. 1.4 లక్షల వరకు డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 1, 2022 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. ప్రామాణిక JeetX వేరియంట్ డెలివరీ సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభమవుతుండగా, JeetX180 డెలివరీలు సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయి.

ఇదే కాకుండా, కొత్త JeetX సిరీస్ ఇ-స్కూటర్‌లను సెప్టెంబరు 10, 2022 వరకు కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 3,000 విలువైన ఉచిత ఉచిత యాక్సెసరీలను కూడా కంపెనీ అందజేయనుంది.

హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో JeetX స్కూటర్లు భారత మార్కెట్లో ఓలా యొక్క S1 ప్రో, బజాజ్ చేతక్, TVS iQube వంటి EVలతో పోటీపడుతుంది.