తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Atumvader । భారతదేశపు తొలి హైస్పీడ్ ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్ ఇదే.. ధర తక్కువే!

AtumVader । భారతదేశపు తొలి హైస్పీడ్ ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్ ఇదే.. ధర తక్కువే!

HT Telugu Desk HT Telugu

04 July 2022, 14:39 IST

    • హైదరాబాద్‌కు చెందిన EV స్టార్టప్ AtumVader పేరుతో ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను తెలుసుకోండి..
AtumVader
AtumVader

AtumVader

హైదరాబాద్‌కి చెందిన 'ఆటుమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్' అనే EV స్టార్టప్ తమ బ్రాండ్ నుంచి AtumVader అనే మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌ను కేఫ్ రేసర్ ఫార్మాట్‌లో రూపొందించారు. కంపెనీ దీని ధరను ప్రస్తుతం రూ. 99,999/- గా నిర్ణయించారు. మొదటి 1000 మంది కొనుగోలుదారులకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. Atumobile అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 999 టోకెన్ ఎమౌంట్ చెల్లించి ఈ కొత్త బైక్‌ను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఈ బైక్ రెడ్, వైట్, బ్లూ, బ్లాక్, గ్రే అనే ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

AtuVader అనేది ఆటుమొబైల్ కంపెనీ నుంచి వచ్చిన రెండవ మోడల్. ఈ కంపెనీ అక్టోబరు 2020లో ఆటమ్ 1.0 అనే బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు 1000 యూనిట్లకు పైగా సేల్ అయ్యాయి. ఆటమ్ 1.0 తక్కువ-స్పీడ్ గల ఎలక్ట్రిక్ బైక్ కాగా, కొత్తగా వచ్చిన AtumVader ఈ బ్రాండ్ నుంచి వచ్చిన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.

స్పెసిఫికేషన్స్

ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్ అటుమొబైల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 65 కిమీ. ఇందులో 2.4kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. AtuVader ఇ-బైక్ పైప్ ఛాసిస్‌ ఆధారంగా దీని నిర్మాణం ఉంటుంది. యుటిలిటీ అవసరాల కోసం ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 14 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది. అదనంగా LED ఇండికేటర్స్, టెయిల్-ల్యాంప్‌లను ఇచ్చారు.

AtuVader ఎలక్ట్రిక్ బైక్ కొద్దిగా రెట్రోలుక్ అలాగే స్పోర్ట్ లుక్ కలగలిసిన డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంది. దీనికి గుండ్రని హెడ్ ల్యాంప్, సమాంతరమైన సీట్, వెనక వంగినట్లుగా ఉండే ఆర్చ్ ఈ బైక్‌కు మంచి డిజైన్‌ను అందించాయి.

టాపిక్