తెలుగు న్యూస్  /  Lifestyle  /  Is It Good To Making Love During Lunar Eclipse 2022, Check Myths And Facts

Lunar Eclipse 2022 | చంద్రగ్రహణం సమయంలో శృంగారం చేయవచ్చా? చేస్తే ఏమవుతుంది?

HT Telugu Desk HT Telugu

08 November 2022, 16:38 IST

    • Lunar Eclipse 2022 Chandra Grahanam: చంద్రగ్రహణం నేపథ్యంలో అనేక సందేహాలు వస్తున్నాయి. చంద్రగ్రహణం సమయంలో శృంగారం చేయవచ్చా? అనే సందేహానికి సైన్స్ ఏం చెబుతుంది, పురాణ శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Love making during Lunar Eclipse 2022 Chandra Grahanam:
Love making during Lunar Eclipse 2022 Chandra Grahanam: (Unsplash)

Love making during Lunar Eclipse 2022 Chandra Grahanam:

Lunar Eclipse 2022 Chandra Grahanam: హిందూ పురాణాలలో గ్రహాలు, గ్రహణాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉండే మానుషుల స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితులను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలు, కేవలం అపోహలు మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తారు. మరోవైపు సైన్స్ గ్రహణాలను ఖగోళంలో జరిగే సాధారణ సంఘటనలుగా అభివర్ణిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ అవి అబద్దాలే కావచ్చు, అపోహాలు కావచ్చు. కానీ వాటిని ప్రజలను సురక్షితంగా ఉంచటం కోసం రూపొందించిన నిబంధనలు కాబట్టి చాలా కాలంగా పాటిస్తూ వస్తున్నారు.

నవంబర్ 8, మంగళవారం అంటే ఈరోజే చంద్రగ్రహణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది, చాలా రకాల సందేహాలను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా గ్రహణం రోజు శృంగారం చేయవచ్చా? చేస్తే ఏమవుతుంది అనేది చాలా మందికి వచ్చిన సందేహం. అలాగే గ్రహణం విడిచిన తర్వాత కూడా చంద్రుడు రాత్రి కనిపిస్తాడు కదా, మరి ఆ సమయంలోనైనా చేయవచ్చా అనే సందేహాలను కూడా లేవనెత్తారు. అయితే ఇలాంటి సందేహాలకు పంచాంగ కర్తలు ఒకలా సమాధానమిస్తే, సైన్స్ కోణంలో అందుకు విరుద్ధమైన అభిప్రాయాలను అందించారు.

Sex During Lunar Eclipse 2022 Facts and Myths

ముందుగా సైన్స్ ఏం చెప్పిందో తెలుసుకుందాం. సైన్స్ ప్రకారంగానైతే చంద్రగ్రహణం చూసినా కూడా నష్టం ఏం లేదు. సూర్యగ్రహణం జరుగుతున్నప్పుడు చూస్తే అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువ ఉంటుంది, కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేరుగా చూడొద్దు, ప్రత్యేక పరికరాలను ఉపయోగించి మాత్రమే చూడాలని ఉంది. అయితే చంద్రగ్రహణంను నేరుగా చూసినా సురక్షితమేనని నివేదికలు పేర్కొన్నాయి. అలాగే శృంగారం చేయొచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు అని ఉంది.

ఆ తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా అయితే.. సూర్యచంద్రుల గ్రహణాలకు కారణమయ్యేది రాక్షసదేవుడైన రాహు-కేతువులు. ఈ సృష్టికి మూలం, ప్రాకృతిక చర్యలన్నింటికీ కారణం సూర్యచంద్రులే. వాటికి గ్రహణాలు ఏర్పడినపుడు ప్రాకృతిక చర్యలు నిలిచిపోతాయి. ఇలాంటి సమయంలో పనులు చేయడం మంచిది కాదు అని చెబుతుంది.

చంద్రగ్రహణం సమయంలో ఏమి తినకూడదు, నిద్రించకూడదు అలాగే శృంగారం కార్యకలాపాలలోనూ పాల్గొనకూడదు. ఇలాంటి చర్యల వల్ల, దోషం కలుగుతుంది. అది ఇతర అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుందని శాస్త్రం తెలిసినవారు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత కూడా శృంగారం చేయకూడదు. గ్రహణానంతరం తప్పకుండా స్నానం ఆచరించాలి. ఇల్లు శుద్ధి చేసుకోవాలి. భోజనాది కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఆరోజు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు చేయకూడనివి ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.