తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blue Energy's Lng Truck | Cngకి మించిన మైలేజ్‌తో Lng ట్రక్.. 1400 కిమీ ఆగేదేలే!

Blue Energy's LNG Truck | CNGకి మించిన మైలేజ్‌తో LNG ట్రక్.. 1400 కిమీ ఆగేదేలే!

HT Telugu Desk HT Telugu

19 September 2022, 13:19 IST

    • బ్లూ ఎనర్జీ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి LNG ట్రక్కును ఆవిష్కరించింది. ఇది CNG కంటే మెరుగైన మైలేజీని అందిస్తుంది. వివరాలు చూడండి.
Blue Energy Motors LNG Truck
Blue Energy Motors LNG Truck

Blue Energy Motors LNG Truck

మనకు ఇప్పటివరకు CNG వాహనాల గురించి తెలుసు. ఇవి పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తాయి. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కార్బన ఉద్గారాలు కూడా తక్కువగానే వెలువడుతాయి. అయితే ఇప్పుడు ఈ CNG (Compressed Natural Gas) వాహనాలకు మించిన సామర్థ్యాన్ని అందించే LNG వాహనాలు వచ్చేశాయి.

ట్రెండింగ్ వార్తలు

World laughter day 2024: మూతి ముడుచుకుంటే వచ్చేదేం లేదు, ప్రతిరోజూ నవ్వండి నవ్వించండి, ఎక్కువకాలం జీవిస్తారు

Weight Loss Drink : ఇంట్లో తయారుచేసిన డ్రింక్.. ఈజీగా బరువు తగ్గవచ్చు

Usiri Pachadi: ఉసిరి పచ్చడి ఇలా స్పైసీగా చేయండి, వేడివేడి అన్నంలో అదిరిపోతుంది

Beauty Tips : యవ్వనంగా కనిపించేందుకు కలబంద, వేప ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

పూణేకు చెందిన బ్లూ ఎనర్జీ మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) తో నడిచే ట్రక్కును విడుదల చేసింది. ఇది పర్యావరణ హితమైన గ్రీన్ ట్రక్కుగా కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ LNG ద్వారా ఆధారితమైన 5528 4×2 ట్రక్కును తమ మొదటి మోడల్‌గా విడుదల చేసింది.

బ్లూ ఎనర్జీ కంపెనీ ప్రకారం, ఈ గ్రీన్ ట్రక్కు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఇంధనంతో నడుస్తుంది. LNG అనేది సహజ వాయువుకి ఒక రూపం. దీనిని సాధారణంగా సుదూర శ్రేణి అవసరాలను తీర్చగల భారీ-డ్యూటీ వాహనాలలో ఉపయోగిస్తారు. సహజ వాయువును సూపర్ కూలింగ్ చేయడం, ఆపై క్రయోజెనిక్‌గా ద్రవ రూపంలో నిల్వ చేయడం ద్వారా LNG ఏర్పడుతుంది. ఈ గ్యాస్ ద్రవ రూపంలో ఉన్నందున, వాహనంలో ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేయవచ్చు, తద్వారా వాహనానికి ఎక్కువ రేంజ్ లభిస్తుంది. ఇలాంటి LNG వాహనాలు సాధారణంగా యూరోప్ దేశాలలో కనిపిస్తాయి.

Blue Energy LNG Truck ముఖ్యాంశాలు

బ్లూ ఎనర్జీ గ్రీన్ ట్రక్కును 5528 4×2 పేరుతో పిలుస్తున్నారు. ఇందులో 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్‌ను అందించారు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే సుమారు 1400 కి.మీల పరిధిని అందించగలదని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ గ్రీన్ ట్రక్ లోని ఇంజన్ 280hp పవర్, 1000Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

అంతేకాదు ఈ ట్రక్ కేవలం LNGతో మాత్రమే కాకుండా CNG, బయోమీథేన్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిలో ఎలాంటి ఎలాంటి గ్యాస్‌తో అయినా ఈ ట్రక్ నడపవచ్చు.

LNG తో 16 శాతం ఖర్చులు అదనంగా తగ్గుతాయి. అంతేకాకుండా Co2ని 30 శాతం వరకు తగ్గించడంలో సహాయపడుతుంది.