Hydrogen energy| పెట్రోల్ బదులు హైడ్రోజన్‌.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్!-chinas hydrogen fuel price to be competitive against petrol and diesel ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  China's Hydrogen Fuel Price To Be Competitive Against Petrol And Diesel

Hydrogen energy| పెట్రోల్ బదులు హైడ్రోజన్‌.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్!

Rekulapally Saichand HT Telugu
Dec 31, 2021 01:41 PM IST

హైడ్రోజన్ ఇంధనాన్ని వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న డీజిల్,ప్రెట్రోల్ కారణంగా సామాన్యుల జేబులకు చిల్లులు పడడంతో పాటు వీటి వల్ల మూడింట ఒక వంతు కార్బన్ ఉద్గారాలు గాల్లో కలుస్తున్నాయి. ఫలితంగా పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది.

FILE PHOTO: Electric cars sit charging in a parking garage at the University of California, Irvine January 26, 2015. REUTERS/Lucy Nicholson/File Photo
FILE PHOTO: Electric cars sit charging in a parking garage at the University of California, Irvine January 26, 2015. REUTERS/Lucy Nicholson/File Photo (REUTERS)

రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలతో విసుగు చెందిన ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో CNG,ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణానికి హాని చేయని ఈ ఇంధనాలను కేంద్ర ప్రభుత్వం కూడా పోత్సహిస్తోంది. అంతేకాకుండా హైడ్రోజన్‌ ఇంధనం వినియోగంపై కూడా కేంద్రం దృష్టి సారించింది.  అంతరిక్షంలోకి పంపే రాకెట్లలో ఉపయోగించే ఇంధనాన్ని సాధారణ వాహనాలలో వాడడంపై అనేక సందేహలు నెలకొన్నాయి. వీటి ధరలు ఎలా ఉంటాయి? ఈ ఇంధనంతో నడిచే వాహనాలు ఎంత వరకు మైలేజ్ ఇస్తాయి? అనే అంశాలపై కొంత అయోమయం నెలకొంది.

ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ..

హైడ్రోజన్ ఇంధనాన్ని వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న డీజిల్,ప్రెట్రోల్ కారణంగా సామన్యుల జేబులకు చిల్లులు పడడంతో పాటు వీటి వల్ల మూడింట ఒక వంతు కార్బన్ ఉద్గారాలు గాల్లో కలుస్తున్నాయి. ఫలితంగా పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న కేంద్రానికి హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకొస్తే కొంత ఊరట కలుగుతుంది. 

సంప్రదాయ ఎలక్ట్రిక్ కంటే హైడ్రోజన్‌ ఇంధనాన్ని వాడడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే హైడ్రోజన్ టెక్నాలజీ ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదు. ప్రెటోల్,డీజిల్‌కు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయాత్నాలు వేగవంతమైతే హైడ్రోజన్ ఇంధనం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చే అవకాశముంది. 

శిలాజ ఇంధనాలే ఆధారం.. 

ప్రపంచం మెుత్తం శిలాజ ఇంధనాలపై ఆధారపడుతోంది. భవిష్యత్‌లో ఇవి తరిగిపోయే అవకాశముంది. కాబట్టి హైడ్రోజన్‌ ఇంధనాలతో వాటిని భర్తీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రస్తుతమున్న ధరలు తగ్గుతాయి. ఇంధన ధరలతో పరోక్షంగా ప్రభావితమవుతున్న నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. హైడ్రోజన్ ఇంధనం ప్రకృతిలో విరివిగా లభిస్తుంది. దీన్ని పెట్రోల్‌ కంటే సులభంగా మండించవచ్చు. కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. దేశంలో రవాణా మార్గాన్ని ఎక్కువగా వినియోగిస్తారు కాబట్టి హైడ్రోజన్‌ను వాడకంలోకి తెస్తే పర్యావరణానికి కూడా లబ్ది చేకూరడంతో పాటు డబ్బును కూడా ఆదా చేయవచ్చు.

 

WhatsApp channel

సంబంధిత కథనం