తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Milk For Hair : ఈ పాలను ఉపయోగించండి.. మీ జుట్టు రాలదు

Coconut Milk For Hair : ఈ పాలను ఉపయోగించండి.. మీ జుట్టు రాలదు

HT Telugu Desk HT Telugu

25 March 2023, 13:30 IST

google News
  • Coconut Milk For Hair : చాలామంది జుట్టు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏవేవో రసాయనాలను వాడుతున్నారు. దీంతో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అదే ఇంట్లోనే కొన్నింటిని తయారుచేసుకుని సమస్యల నుంచి బయటపడొచ్చు.

జుట్టుకు కొబ్బరి పాలు
జుట్టుకు కొబ్బరి పాలు

జుట్టుకు కొబ్బరి పాలు

జుట్టు రాలడం(Hair Loss), తెల్ల జుట్టు(White Hair), చుండ్రు సమస్యలు ఈ కాలంలో అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జుట్టు అందంగా ఉంటే.. మనం కూడా చక్కగా కనిపిస్తాం. అయితే అందమైన జుట్టును మెయింటెన్ చేయాలంటే.. కాస్త కేర్ తీసుకోవాల్సిందే. ఏం కాదులే అని అలానే వదిలేస్తే.. చిన్న వయసులోనే జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు రావొచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని(Hair Health) మెరుగుపరిచేందుకు కొబ్బరి పాలను ఉపయోగించండి. ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.

కొబ్బరి పాలను(Coconut Milk) జుట్టుకు పట్టిస్తే.. చాలా సమస్యలు తగ్గుతాయి. కుదుళ్లు బలంగా తయారు అవుతాయి. జుట్టు, ఒత్తుగా పెరుగుతుంది. మంచిగా కాంతివంతంగా ఉంటుంది. జుట్టు రాలడం(Hair Loss) సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి పాలు బెస్ట్ ఆప్షన్. జుట్టు సమస్యలు ఎదుర్కొనేవారు కొబ్బరి పాలను ఉపయోగిస్తే.. చాలా ప్రయోజనం. అయితే ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

కొబ్బరి పాలల్లో ప్రోటిన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు అందంగా, ఆరోగ్యంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. జుట్టు దెబ్బతింటే.. కొబ్బరి పాలు ఆరోగ్యంగా చేస్తాయి. కొబ్బరి పాలను జుట్టు కుదుళ్లకు పట్టిస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది. అందంగా మెరుస్తుంది. దీనిని బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

ఒక కొబ్బరి కాయను తీసుకోండి. అది పగలగొట్టాక అందులోని కొబ్బరిని తీయండి. ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక జార్ లో వేసి.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వస్త్రంలోకి కొబ్బరి పేస్ట్(Coconut Paste) తీసుకుని మూట కట్టుకోవాలి. తర్వాత దానిని గట్టిగా పిండుతూ గిన్నెలోకి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఆ తర్వాత దీనిని జుట్టుకు ఉపయోగించండి.

అయితే కొబ్బరి పాలను జుట్టు పట్టించేముందు.. జుట్టు శుభ్రంగా, నూనె(Oil) లేకుండా చేయాలి. తర్వాత ఈ కొబ్బరి పాలను రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లకు పట్టించాలి. రాత్రంతా అలానే ఉంచాలి. ఏం కాదు. ఉదయాన్నే తలస్నానం(Headbath) చేయాలి. అయితే రసాయనాలు తక్కువగా ఉంటే షాంపూను ఉపయోగించడం మంచిది. ఇలా వారానికి ఒకసారి చేయండి. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. రెండు, మూడు నెలల పాటు ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం