తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eggs Quality । గుడ్లు ఎంతకాలం నిల్వ ఉంటాయి.. పాడైనట్లు ఎలా తెలుస్తుంది?

Eggs Quality । గుడ్లు ఎంతకాలం నిల్వ ఉంటాయి.. పాడైనట్లు ఎలా తెలుస్తుంది?

Manda Vikas HT Telugu

07 July 2022, 21:35 IST

    • గుడ్లు చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఈజీగా వండుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో లేదా డిన్నర్‌లో ఎప్పుడైనా తినొచ్చు. మరి మీరు తింటున్న గుడ్లు తాజావేనా? ఎలా తెలుస్తుంది? ఈ స్టోరీ చదవండి..
Eggs
Eggs (Pixabay)

Eggs

గుడ్లు తినడం మన ఆరోగ్యానికి మంచిది. ఏ కాలంలోనైనా మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని వండుకోవడం కూడా చాలా తేలిక. అయితే ఎలాంటి ఆహార పదార్థాలైనా ఒక నిర్ధిష్ట కాలపరిమితి ముగిస్తే అవి చెడిపోతాయి. పండ్లు, కూరగాయలు మరేతర ఆహార పదార్థాలు కుళ్లిపోతే మనం సులభంగా గుర్తించవచ్చు. వాటి రంగు, వాసన మారిపోతుంది. మరి గుడ్లు పాడైపోయినట్లు ఎలా తెలుస్తుంది? అసలు గుడ్లు ఎంతకాలం నిలువ ఉంటాయి? ఎన్ని రోజులు దాటితే వాటిని తినకూడదు? వంటి విషయాలపై చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు.

కిరాణా షాపుల్లో లభించే గుడ్లు తాజావో, కావో తెలియదు. వాటిని ఎన్ని రోజుల నుంచి నిలువ ఉంచారో మనకు సమాచారం ఉండదు. సూపర్ మార్కెట్లలో లభించే గుడ్లు 'బెస్ట్ బిఫోర్' తేదీలతో వస్తాయి. మరి ఆ తర్వాత అవి చెడిపోయినట్లా? ఇలా ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. మరి వీటన్నింటికి మీకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవండి.

ఇక్కడ కొన్ని మీకు మార్గాలను అందిస్తున్నాం. వీటిని అనుసరించి మీరు తినే గుడ్లు స్వచ్ఛమైనా లేక చెడిపోయినవా ? అనే దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

గుడ్లు ఎంత కాలం నిల్వ ఉంటాయి?

గుడ్లకు షెల్ ఉంటుంది కాబట్టి అవి చాలా స్థితిస్థాపకంగా ఉంటాయి. ప్రాసెసింగ్ చేయడం వలన కొద్దికాలం పాటు అవి తాజాగానే ఉంటాయి. సాధారణం గుడ్లు అవి ప్రాసెసింగ్ చేసిన సమయం నుంచి సుమారు నాలుగు వారాల పాటు బాగానే ఉంటాయి. కాబట్టి సూపర్ మార్కెట్లో లభించే గుడ్ల తేదీని గమనించండి.

అలాగే గుడ్లను నిల్వచేసేందుకు సరైన వాతావరణం, అనుకూలమైన పరిసరాలు ఉండాలి. గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు 30-45 రోజులు నిల్వచేసుకొని తినవచ్చు. అయితే గది ఉష్ణోగ్రతలో 7-10 రోజులకు మించి నిల్వ ఉంచకుండా చూసుకోవాలి.

గుడ్లు పాడయినట్లు తెలుసుకోవడం ఎలా?

గుడ్ల తాజాదనాన్ని తెలుసుకునేందుకు ఒక సులభమైన, బాగా ప్రాచుర్యం పొందిన పద్ధతి ఒకటి ఉంది. అదే నీటి పరీక్ష.

ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి. అందులో గుడ్లను వేయండి. గుడ్లు అడుకు చేరితే అవి తాజాగా ఉన్నాయని అర్థం. ఒకవేళ అడుగు చేరాయి, కానీ సన్నని కొన మీద నిలబడ్డాయి అనుకోండి. దాని అర్థం, కొద్దిగా తాజాదనం లోపించింది. అయినప్పటికీ కూడా తినదగినవే.

ఇక ఒకవేళ గుడ్లు నీటి పైకి తేలాయి అనుకోండి. వాటిలో తాజాదనం లోపించింది. కాలపరిమితి ముగిసిందని అర్థం. ఇలా పైకి తేలిన గుడ్లను కూడా బాగా ఉడికించినపుడు వాటి పొర లోపలి పదార్థం బయటకు వచ్చేస్తుంది.

అయితే గుడ్లు రంగుమారినా లేదా పగుళ్లు ఏర్పడినా లేదా అసాధారణ వాసన ఏర్పడితే కుళ్లిపోయాని అర్థం. వాటిని అస్సలు తినకూడదు.

టాపిక్