తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Food Safety : ఫుడ్‌సేఫ్టీలో మనమే లాస్ట్.. ర్యాంకులు ఇచ్చిన కేంద్రం

Food Safety : ఫుడ్‌సేఫ్టీలో మనమే లాస్ట్.. ర్యాంకులు ఇచ్చిన కేంద్రం

HT Telugu Desk HT Telugu

08 June 2022, 21:03 IST

    • ఆహార శుభ్రతలో మన రాష్ట్రం వెనకబడి ఉంది. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే చివరలో ఉందని కేంద్రం ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీలో చివరన ఉంది. ఈ మేరకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. ఐదు పారామీటర్స్‌లో తమిళనాడు 82 పాయింట్లు తెచ్చుకుని అగ్రస్థానంలో ఉంది. బీహార్ కంటే కూడా తక్కువగా కేవలం 26 పాయింట్లు మాత్రమే ఏపకి వచ్చాయి. అలా చివరన నిలిచిపోయింది. ఆహార శుభ్రతపై.. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ( FSSAI) అన్ని రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. అనంతరం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఎఫ్ఎస్‌ఏఏఐ ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ ర్యాంకులను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

జూన్ 7న ప్రతి సంవత్సరం.. వ‌ర‌ల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా నిర్వహిస్తారు. ఆహార భద్రత ప్రాముఖ్యత, వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ఈ రోజు ప్రధాన ల‌క్ష్యం. ఈ ఏడాది ‘సుర‌క్షిత‌మైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం’ అనే థీమ్‌ ఫుడ్ సేఫ్టీ డే జరిగింది. బుధవారం ర్యాంకులు ప్రకటించారు.

ఫుడ్ సేఫ్టీకి సంబంధించి పరిగణనలోకి తీసుకున్న ఐదు అంశాలు.. మానవ వనరులు, సంస్థాగత డేటా, ఫిర్యాదులు, ఆహార పరీక్ష మౌలిక సదుపాయాలు, నిఘా, శిక్షణ, సామర్థ్యం పెంపుదల, వినియోగదారుల సాధికారతలాంటి అంశాలను పరిగణనలోకీ తీసుకున్నారు. వీటన్నింటీలో.. తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం గుజరాత్‌కు సంపాదించింది. గుజరాత్‌కు 7౦ పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసుగా మూడో ప్లేస్ లో మహారాష్ట్ర ఉంది. చివరిగా ఏపీకి చోటు లభించింది.

చిన్న రాష్ట్రాల కేటగిరిలో గోవా అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో మణిపూర్, సిక్కిం ఉన్నాయి. ఆఖరి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ కు చోటుదక్కింది. ఫుడ్ సేఫ్టీలో గత ఏడాది గుజరాత్ అగ్ర స్థానంలో నిలిచింది. కేరళ , తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉండేవి. ఈ ఏడాది మాత్రం అన్నింటిని వెనక్కు నెట్టిన తమిళనాడు.. మెుదటిస్థానంలో నిలిచింది. ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఆహారాన్ని శుభ్రంగా అందిస్తున్నారో లేదో అంచనా వేయడంలో ఈ ర్యాంకులను చూస్తారు.

ఈ ర్యాంకులు ఇవ్వడం 2018లో ప్రారంభమైంది. దేశంలోని ఆహార భద్రత, సరైన ఆహాన్ని తీసుకోవడం తదితర అంశాల్లో పోటీతత్వం కోసం.. ఈ ర్యాంకులను సృష్టించారు. పౌరులకు సురక్షితమైన ఆహారాన్ని అందించడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకునేలా ఇవి ఉపయోగపడతాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన మరియు పౌష్టికాహారాన్ని అందించడంలో ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 (FSS చట్టం) కింద స్థాపించబడిన FSSAI ఈ ర్యాంకులను ప్రతీ ఏటా ప్రకటిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం