తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wedding Venues । వివాహ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే వివాహ వేదిక ఇలా ఉండాలి!

Wedding Venues । వివాహ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే వివాహ వేదిక ఇలా ఉండాలి!

HT Telugu Desk HT Telugu

20 May 2023, 15:41 IST

    • Wedding Venues: వివాహ వేదికలను సాంప్రదాయంగా గుడిలోనో లేదా ఏదైనా కళ్యాణమండపంలోనో కాకుండా సంప్రదాయేతర వివాహ వేదికలలో పెళ్లి వేడుకను జరుపుకోవడం ద్వారా మీ పెళ్లితంతును మరపురాని కావ్యంగా మార్చుకోవచ్చు. వేదికకు సంబంధించి కొన్ని ఆలోచనలు ఇక్కడ తెలుసుకోండి.
unconventional wedding venues ideas
unconventional wedding venues ideas (Unsplash)

unconventional wedding venues ideas

Wedding Venues: ఈరోజుల్లో వివాహ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. పెళ్లి అనేది జీవితంలో మరపురాని వేడుక కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెరవకుండా సినిమా తీసినంత పనిచేస్తున్నారు. వివాహ వేదిక మొదలుకొని, కెమెరాలో చిత్రీకరణ వరకు ప్రతీ ఒక్క అంశాన్ని ఆచితూచి ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో అందమైన ప్రాంతాలకు వెళ్లి వివాహాలు జరుపుకుంటుండగా, మరికొందరు తాము ఉన్న చోటనే భారీసెట్టింగ్స్ వేసి మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.

మీరు కూడా మీ పెళ్లికి ఇలాంటి అనుభవం కోరుకుంటుంటే.. వివాహ వేదికలను సాంప్రదాయంగా గుడిలోనో లేదా ఏదైనా కళ్యాణమండపంలోనో కాకుండా సంప్రదాయేతర వివాహ వేదికలలో పెళ్లి వేడుకను జరుపుకోవడం ద్వారా మీ పెళ్లితంతును మరపురాని కావ్యంగా మార్చుకోవచ్చు. మీ పెళ్లికి వచ్చే అతిథులను విస్మయానికి గురిచేయవచ్చు. మంత్రముగ్ధులను చేసే అడవులు మొదలుకొని, సుందరమైన బీచ్‌లు, చారిత్రాత్మక గ్రంథాలయాలు, ఆర్ట్ గ్యాలరీలు ఇలా దేనినైనా మీ పెళ్లికి వేదిక చేసుకునేందుకు ఇప్పుడు ఎన్నో ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థలు సేవలను అందిస్తున్నాయి.

అయితే, పెళ్లి వేడుక కోసం ఎక్కడికో వెళ్లకుండా, మీరు ఉన్నచోటనే విలక్షణమైన వేదిక సెట్టింగ్ ఏర్పాటు చేసుకొని కూడా సౌకర్యంగా పెళ్లిచేసుకోవచ్చని ఈవెంట్ ఆర్గనైజర్స్ చెబుతున్నారు. మీ ఇంటి పెరట్లోనో లేదా మీ పొలంలోనే వివాహ వేదిక ఏర్పాటు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది, అద్భుతమైన వేదిక కూడా ఏర్పాటవుతుంది. 'అల్లెజియంట్ ఈవెంట్స్' వ్యవస్థాపకుడు నీరవ్ తలేశ్వర్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ అలాంటి కొన్ని పెళ్లి వేదికల గురించి తెలియజేశారు. వివాహ వేదికకు సంబంధించి కొన్ని ఆలోచనలు ఇక్కడ తెలుసుకోండి.

1. మ్యూజియంలు

ఇప్పుడు అనేక మ్యూజియంలు వివాహాలు, రిసెప్షన్‌ల కోసం ఈవెంట్ స్థలాలను అందిస్తున్నాయి. అమూల్యమైన కళాఖండాల మధ్య వివాహం చేసుకోవడం ఎంత విభిన్నంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.

2. బొటానికల్ గార్డెన్స్

మీరు ప్రకృతి ప్రేమికులైతే, గ్రీన్‌హౌస్ లేదా బొటానికల్ గార్డెన్‌లో పెళ్లి చేసుకోవడాన్ని పరిగణించండి. మీ చుట్టూ పచ్చదనం, రంగురంగుల పూల మధ్య వివాహ వేడుక ఎంతో ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

3. కోటలు/ చారిత్రాత్మక భవనాలు

రాజుల కాలం నాటి అనుభూతి, రాజుల వివాహ వేడుక జరుగుతున్న అనుభూతి కలగాలంటే ఏదైనా కోటను లేదా చారిత్రాత్మక భవనాన్ని ఎంచుకోవచ్చు. రాచరికపు విలాసాన్ని ఆస్వాదించవచ్చు.

4. రూఫ్‌టాప్‌లు

స్కైలైన్‌ని బ్యాక్‌డ్రాప్‌గా విశాలమైన వీక్షణల కోసం మీరు వెతుకుతున్నట్లయితే, మీ నగరంలోని ఏదైనా ఎత్తైన భవంతి రూఫ్ టాప్ పైన మీ వివాహ వేడుకలను నిర్వహించండి. నగరం అందమైన వీక్షణలను చూస్తూ వివాహాన్ని ఆనందించండి. రూఫ్‌టాప్ వెడ్డింగ్ అనేది ఒక ఉత్కంఠభరితమైన అనుభవం.

5. ద్రాక్షతోటలు

వైన్ తయారు చేసే ద్రాక్ష తోటల్లో మీరు ఎప్పుడైనా విహరించారా? అదొక ప్రత్యేకమైన అనుభూతి, అలాంటి ద్రాక్షతోటల్లో వివాహ వేడుకలు ఇంకా ప్రత్యేకంగా నిలుస్తాయి. మనోహరమైన వాతావరణాన్ని అందిస్తాయి.