తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Tips For Pre-wedding Photoshoot: ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అదిరిపోయేలా రావాలంటే.. ఇవి గుర్తుంచుకుంటే చాలు

Best tips for pre-wedding photoshoot: ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అదిరిపోయేలా రావాలంటే.. ఇవి గుర్తుంచుకుంటే చాలు

19 April 2023, 16:48 IST

    • Best tips for pre-wedding photoshoot: ప్రి వెడ్డింగ్ ఫోటో / వీడియో షూట్ కోసం ఈ రోజుల్లో ప్రతి పెళ్లి కాబోయే జంట ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ థీమ్స్ తో ఈ షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే షూట్ కోసం కొన్ని ముందస్తు కసరత్తులు చేసుకుంటే జీవితాంతం గుర్తుండిపోయే చక్కని వీడియో, ఫొటోలు మీ దగ్గరుంటాయి.
 ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్
ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ (pexels)

ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్

ఫోటోషూట్ అంటేనే కొత్తగా అనిపించొచ్చు. పెళ్లికి ముందు ఇది తప్పని సరి వేడుక అయిపోయిందిపుడు. పక్కా ప్రణాళికతో ప్రతిదీ ముందుగానే సిద్ధం చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా, హాయిగా షూట్ పూర్తి చేసుకోవచ్చు. దానికోసం మీరు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివే..

ట్రెండింగ్ వార్తలు

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

సాంగ్ ముందుగానే ఎంచుకోండి:

మీ వీడియోకు ప్రాణం పాటే. మీ మనసుకు తగ్గ, మీకు నప్పే పాట ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఫోటోగ్రాఫర్ మీద పూర్తిగా ఆధారపడకుండా మీ ఇద్దరికీ ఎలాంటి జోనర్ పాటలు ఇష్టమో ఆలోచించండి. నేరుగా ఏదో పాటకు షూట్ చేసుకోవడానికి, పాట ముందుగానే ఎంచుకొని షూట్ ప్లాన్ చేసుకోడానికి చాలా తేడా ఉంటుంది. పాట లిరిక్స్‌కి తగ్గట్టుగా కొన్ని కాస్టూమ్స్ కూడా ఎంచుకునే వీలుంటుంది.

కాస్ట్యూమ్స్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి :

అమ్మాయిలకైతే లాంగ్ టెయిల్ ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్, లాంగ్ సారీస్ ఫోటోషూట్‌లకు తప్పనిసరి అయిపోయాయి. అయితే వీటిని కుట్టించాలన్నా, కొనాలన్నా చాలా ఖర్చు అవుతుంది. అందుకే అన్నీ నేరుగా కొనకుండా.. అద్దెకు తీసుకోండి. ఆన్‌లైన్‌లో అలాంటి సైట్లు బోలెడుంటాయి. అలాగే తేలికైన వస్త్రం రకం ఎంచుకోవడం అతిముఖ్యం. ఉదాహరణకు శాటిన్, ఆర్గాంజా, సిల్క్ బట్టలు చాలా తేలికగా ఉంటాయి. ఫోటోలలో వివిధ స్టిల్స్ కోసం డ్సెస్సులకుండే పొడవాటి టెయిల్‌ని గాల్లోకి ఎగరేసినపుడు అవి ఎక్కువ దూరం పైకి వెళతాయి. బరువుగా ఉండే వస్త్రాలతో అది సాధ్యం కాదు. వీటితో పాటే అనార్కలి, హాఫ్ షోల్డర్ డ్రెస్, మిడీ డ్రెస్, సాయంత్రం షూట్ ఉంటే ఒక ఈవెనింగ్ గౌన్ మర్చిపోకండి. అబ్బాయిలకైతే సాంప్రదాయంగా ఉండే దోవతి, పంచ.. అలాగే ఒక ప్లెయిన్ కుర్తా, ఫార్మల్ సూట్, నెహ్రూ కుర్తా తప్పనిసరి ఎంపికలు.

మంచి ఫోటోలు రావాలంటే..

కొన్ని ప్రాపర్టీలు తప్పక వెంట తీసుకెళ్లండి. వివిధ రంగుల్లో స్మోక్ బాంబ్స్, పెద్ద గొడుగు, గిటార్‌ లాంటివి మంచి ప్రాపర్టీస్ గా పనికొస్తాయి. అలాగే ముందుగానే షూటింగ్ లొకేషన్ ఎంపిక చేసుకోండి. ఫోటోల్లో ఇది చాలా కీలకం. ఇక కొంతమందికి ఫోటోలకు పోసులు ఇవ్వడం కాస్త ఇబ్బందిగా, మొహమాటంగా ఉంటుంది. అలాంటప్పుడు మీ ఫోటోగ్రాఫర్ కి చెప్పి ఏదైనా యాక్టివిటీ ప్లాన్ చేయమనండి. అప్పుడే ఫోటోలు తీయమనండి. దానివల్ల మీరు ఫోటోల విషయం మర్చిపోవడమే కాదు మంచి క్యాండిడ్ ఫోటోలూ వస్తాయి.

అతిగా వద్దు..

డ్రెస్సుల మీద ప్రింట్లు, పెద్ద పెద్ద డిజైన్లు లేకుండా చూసుకోండి. వీటివల్ల దృష్టి వాటిమీదకే మళ్లుతుంది. వీలైనంత వరకు లేతరంగులో ఉండే ప్లెయిన్ డ్రెస్సులనే ఎంచుకోండి. అలాగే జ్యువెలరీ కూడా అతిగా వద్దు. చిన్న చిన్న స్టేట్‌మెంట్ నగలు, పెండెట్లు సరిపోతాయి. మేకప్ కూడా చాలా సింపుల్‌గా మీ ముఖ రూపురేఖల్ని హైలైట్ చేసేలా ఉండాలంతే. జుట్టు వీలైనంత వరకు అలాగే వదిలేయండి. ముందుగానే మంచి హెయిర్ కట్ చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి. అది లుక్ మార్చేస్తుంది. వీటన్నింటితో పాటే మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా ముందునుంచే జాగ్రత్తలు పాటించండి.

టాపిక్

తదుపరి వ్యాసం