తెలుగు న్యూస్  /  Lifestyle  /  Don't Drink Sugarcane Juice Who Facing These Problems

Sugarcane Juice : ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగకూడదు

HT Telugu Desk HT Telugu

03 March 2023, 18:30 IST

    • Sugarcane Juice : చెరకు రసం చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం. అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తోంది. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం.. చెరకు రసం తాగకూడదు.
చెరకు రసం
చెరకు రసం (unsplash)

చెరకు రసం

చెరకు రసం ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం దీనికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పొట్టను శుభ్రపరచడంలో చెరకు రసం(Sugarcane Juice) వల్ల ఎలాంటి హాని ఉండదు. ఇందులో చాలా ఇనుము ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చెరకు రసం తాగడం వల్ల శరీరానికి త్వరగా శక్తి వస్తుంది. అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, చెరకు రసం కొన్ని వ్యాధులు ఉన్నవారు తీసుకోవద్దు. లేకుంటే ప్రమాదకరం. ఏయే వ్యాధులు ఉన్నవారు చెరకు రసం తీసుకోకూడదు.

మధుమేహం ఉన్నవారు చెరకు రసం తాగకూడదు. నిజానికి చక్కెర పానీయాల కంటే చెరకు రసం తియ్యగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు చెరకు రసాన్ని తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అయితే, చెరకు రసంలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని, ఇది ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని ఒక అధ్యయనం పేర్కొంది. కానీ చాలా సందర్భాలలో డయాబెటిక్ పేషెంట్లు దీనికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు.

2014లో గుండె జబ్బులు, చెరకు రసానికి సంబంధించి JAMA ఇంటర్నల్ మెడిసిన్‌లో ఒక అధ్యయనం ప్రచురించబడింది. ఈ అధ్యయనంలో, చక్కెర నుండి 20 శాతం శక్తిని పొందిన వ్యక్తులు గుండె జబ్బులతో(heart disease) మరణించే ప్రమాదం 38 శాతం ఎక్కువ. చెరకు రసంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హృద్రోగులు దీనికి దూరంగా ఉండాలి.

చెరకు రసం చాలా తీపిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, దానిని తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. బీపీ ఎక్కువగా ఉన్నవారు చెరకు రసం తాగకూడదు. ఇది వారికి ప్రమాదకరం. చెరకు రసం కూడా శరీరంలో కొలెస్ట్రాల్(cholesterol) స్థాయిలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు దూరంగా ఉండాలి. ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది.

చెరకు రసాన్ని నిరంతరం తాగితే ఊబకాయం త్వరగా వస్తుంది. దీని కారణంగా, మీ బరువు అకస్మాత్తుగా పెరుగుతుంది. బరువు పెరగడంలో చక్కెర ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, చెరకు రసం త్వరగా బరువును పెంచుతుంది.