చెరుకు రసాన్ని ఈ పరిస్థితుల్లో అసలు తాగకూడదు!-benefits of sugarcane juice for health and skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Benefits Of Sugarcane Juice For Health And Skin

చెరుకు రసాన్ని ఈ పరిస్థితుల్లో అసలు తాగకూడదు!

HT Telugu Desk HT Telugu
Mar 26, 2022 11:08 PM IST

వేసవికాలం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో డీహైడ్రేషన్ కాకుండా ఎక్కువ నీరు తాగుతుంటారు. సాధరణంగా చాలా మంది వేసవిలో తమ డైట్‌లో మార్పులు చేసుకుంటారు.

sugar cane juice
sugar cane juice

వేసవికాలం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో డీహైడ్రేషన్ కాకుండా ఎక్కువ నీరు తాగుతుంటారు. సాధరణంగా చాలా మంది వేసవిలో తమ డైట్‌లో మార్పులు చేసుకుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే ఆహరాలను తమ డైట్‌లో చేర్చుకుంటారు.ఎండాకాలంలో చెరుకు రసం తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం పోందడానికి దీన్ని మంచి మార్గంగా భావిస్తారు. అయితే చెరకు రసం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి. అరోగ్యా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం.

 

కాలేయం, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారు, రక్తపోటు ఉన్న వారికి ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. సహజంగా చెరకు రసంలో అనేక పోషకాలు ఉన్నాయి. చెరకు రసం జీర్ణక్రియకు సహాయపడుతుంది.చెరకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది, జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. కాల్షియం , ఫాస్పరస్ వంటి ఖనిజాలు చెరకు రసంలో ఉంటాయి, ఇది దంతాలను బలంగా చేస్తుంది. అలాగే, దంతాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. చెరకు రసంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది నోటి దుర్వాసన రాకుండా చేస్తోంది.అయితే ఇంతటి ప్రయోజనాలు ఉన్న చెరుకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా చెరకు రసం తాగొచ్చా? అనే డౌట్ చాలా మంది ఉంటుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరుకు రసం తాగాలా?

చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే చెరుకు రసానికి దూరంగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీపీతో ఉన్నవి వేటిని కూడా తీసుకోవడం మంచిది కాదు. చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైనది కాదు.

WhatsApp channel