తెలుగు న్యూస్  /  Lifestyle  /  Butter Chicken Momos For Breakfast Here Is The Recipe

Butter Chicken Momos Recipe : బటర్ చికెన్ మోమోస్.. చేయడం చాలా సింపుల్

25 November 2022, 6:43 IST

    • Butter Chicken Momos Recipe : కార్తీకమాసం అయిపోయింది. చాలా మంది ఈ మాసంలో నాన్​వెజ్ తినరు. అయితే నిన్నటితో కార్తీకమాసం ముగిసింది కాబట్టి.. నేటి నుంచి నాన్​వెజ్​ ఎక్కువగా తినేందుకు చూస్తారు. అయితే మీరు చికెన్ ఫాంటసీలను తీర్చుకోవాలనుకుంటే బటర్ చికెన్ మోమోస్​లను ట్రై చేయాల్సిందే. 
బటర్ చికెన్ మోమోస్
బటర్ చికెన్ మోమోస్

బటర్ చికెన్ మోమోస్

Butter Chicken Momos Recipe : పిల్లల నుంచి పెద్దలవరకు చాలామంది మోమోస్​ను ఇష్టంగా తింటారు. అయితే వీటిని ఇంట్లో చేసుకోవడం కష్టమని భావించి.. చాలా మంది ఎలా చేసుకోవాలా? ఎలా ఈ క్రావింగ్స్ తీర్చుకోవాలా? అనుకుంటారు. అయితే మీరు చాలా సింపుల్​గా, టేస్టీగా ఈ బటర్ చికెన్ మోమోస్​ను తయారు చేయవచ్చు. ఈ క్లాసిక్ ఫ్యూజన్​ని మీరు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బటర్ చికెన్ గ్రేవీ - 1/2 కప్పు

* ఆల్ పర్పస్ ఫ్లోర్ - 1 1/2 కప్పు

* చికెన్ - 200 గ్రాములు

* అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

* బ్లాక్ పెప్పర్ - రుచికి తగినంత

* సాల్ట్ - రుచికి తగినంత

* నూనె - తగినంత

* ఫ్రెష్ క్రీమ్ - గార్నీష్ చేయడానికి

తయారీ విధానం

ఆల్-పర్పస్ పిండిని నీరు వేసి.. బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిని మూత వేసి పక్కన పెట్టండి. చికెన్‌ను తీసుకుని దానిలో ఉప్పు, బ్లాక్‌పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి మసాలా దినుసులు వేసి.. బాగా కలపండి. మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకుని.. చిన్న చిన్న చపాతీలుగా ఒత్తి.. దానిలో చికెన్ స్టవ్ పెట్టి.. మోమోస్ లాగా చుట్టుకోవాలి. ఈ మోమోస్‌ను 10-12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి.. మోమోస్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. అవి వేగిన తర్వాతా.. బటర్ చికెన్ గ్రేవీ వేసి అన్నీ బాగా కలపాలి. వీటిని ఫ్రెష్ క్రీమ్​తో గార్నిష్ చేయవచ్చు. అంతే మీ బటర్ చికెన్ మోమోస్ ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాయి.