Chicken Grilled Sandwich Recipe : చికెన్ గ్రిల్డ్ శాండ్‌విచ్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా
23 November 2022, 7:19 IST
- Chicken Grilled Sandwich Recipe : ఉదయాన్నే సులభమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే మీరు చికెన్ గ్రిల్డ్ శాండ్‌విచ్ తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని కుక్ చేయడం కూడా చాలా సులభం. ఈజీగా తయారు చేసుకోగలిగే దీనిని.. మీరు మీ బీజీ డేలో కూడా ట్రై చేయవచ్చు.
గ్రిల్డ్ చికెన్ శాండ్‌విచ్
Chicken Grilled Sandwich Recipe : మీ రోజును సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేయాలనుకుంటే.. మీరు చికెన్ గ్రిల్డ్ శాండ్‌విచ్ ట్రై చేయవచ్చు. ఇది రుచికరమైనదే కాకుండా.. ఆరోగ్యకరమైనది కూడా. దీనిలో చికెన్‌తో పాటు పాలకూరను కూడా ఉపయోగిస్తాము. సింపుల్‌గా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీని.. ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
*చికెన్ కీమా - అరకప్పు (ఉడికించినది)
* వైట్ బ్రెడ్ - 2 స్లైస్
* రెడ్ బెల్ పెప్పర్ - 1/4 కప్పు
* వెన్న - 2 టీ స్పూన్స్
* పాలకూర - 4 ఆకులు (పెద్దవి)
* మయోన్నైస్ - 3 టీ స్పూన్లు
* చాట్ మసాలా - 1 టీస్పూన్
* క్యాప్సికమ్ - పావు కప్పు
గ్రిల్డ్ చికెన్ శాండ్‌విచ్ తయారీ విధానం
ఓ గిన్నె తీసుకోండి. దానిలో చికెన్, బెల్ పెప్పర్, చాటా మసాలా, ఉప్పు, మయోన్నైస్ వేసి బాగా కలపండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని.. రెండు ముక్కలపై వెన్న రాసి.. పాలకూరను దానిపై ప్లేస్ చేయండి. అనంతరం దానిపై చికెన్ ఫిల్లింగ్ వేసి.. వాటిని మరో బ్రెడ్ స్లైస్ ఉపయోగించి క్లోజ్ చేయండి. మిగిలిన వెన్నను.. వాటి పై భాగాన అప్లై చేసి.. శాండ్ విచ్ గ్రిల్ చేయడానికి.. గ్రిల్లర్‌లో ఉంచండి. 2 నుంచి 4 నిముషాలు గ్రిల్ చేస్తే.. మీకు వేడి వేడి గ్రిల్డ్ చికెన్ శాండ్ విచ్ రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైన డిప్‌తో వేడి వేడిగా లాగించేయండి.