Tandoori Chicken Sandwich : తందూరి చికెన్ శాండ్‌విచ్.. ఇలా టేస్టీగా చేసేయండి..
Tandoori Chicken Sandwich Recipe : జిమ్ లేదా వ్యాయామం ఎక్కువగా చేసేవాళ్లు ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి.. మీ బ్రేక్‌ఫాస్ట్‌ని చికెన్‌తో తీసుకోవాలి అనుకుంటే.. తందూరి చికెన్ శాండ్‌విచ్‌ని తయారు చేసుకోండి. దీనిని చేయడం చాలా సులువు కూడా.
Tandoori Chicken Sandwich : నాన్ వెజ్ తినేవాళ్లల్లో మటన్ కంటే చికెన్‌ను ఇష్టపడేవారే ఎక్కువ. అలాగే మీరు కూడా చికెన్ ప్రియులైతే.. మీ బ్రేక్‌ఫాస్ట్‌ని చికెన్‌తోనే స్టార్ట్ చేయండి. పైగా తందూరి చికెన్ శాండ్‌విచ్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండేలా చేస్తుంది. జిమ్ చేసేవారికి కూడా ఇది పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* చికెన్ - 5,6 ముక్కలు
* పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
* కారం - 1 టీస్పూన్
* పెప్పర్ - 1 టీస్పూన్
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* గరం మసాలా - 1 టీస్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
* ఉల్లిపాయ - 1 (ముక్కలు కోయాలి)
* టొమాటో - 1 (ముక్కలు కోయాలి)
* టొమాటో సాస్ - 1 స్పూన్
* క్యాప్సికమ్ - 1 (ముక్కలు కోయాలి)
* బ్రెడ్ - 4
తందూరి చికెన్ శాండ్‌విచ్ తయారీ విధానం
ఒక గిన్నెలో.. నాలుగు-ఐదు చికెన్ ముక్కలను తీసుకోండి. దానిలో పెరుగు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ గంట మెరినేట్ చేయండి. తర్వాత ఓవెన్ లేదా పాన్‌లో బేక్ చేయండి. చికెన్ ఉడికిన తర్వాత.. దానిని బయటకు తీయండి.
ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని వాటిని టోస్ట్ చేయండి. దానిపై టొమాటో సాస్‌ను వేయండి. దానిపై చీజ్, తందూరి చికెన్, ఉల్లిపాయలు, టొమాటోలు, క్యాప్సికమ్ ముక్కలను వేయండి. దాన్ని మరో బ్రెడ్ స్లైస్‌తో మూసివేసి.. కట్ చేసి ఆస్వాదించేయండి.
సంబంధిత కథనం