తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bread Pakodi Chat Recipe : వీకెండ్​కి కొత్తగా బ్రెడ్ పకోడి చాట్​ని ట్రై చేయండి..

Bread Pakodi Chat Recipe : వీకెండ్​కి కొత్తగా బ్రెడ్ పకోడి చాట్​ని ట్రై చేయండి..

19 November 2022, 7:34 IST

    • Bread Pakodi Chat Recipe : ఇంట్లో బ్రెడ్ ఉంటే టోస్ట్ చేసుకుని తింటాము. లేదంటే పాలల్లో ముంచుకుని తింటాము. శాండ్​విచ్​ కూడా చేసుకోవచ్చు. కానీ.. బ్రెడ్​తో వేడి వేడి కరకరలాడే పకోడి చేసుకున్నారా ఎప్పుడైనా?  ఆ పకోడితో చాట్ చేసుకున్నారా? బ్రెడ్​తో పకోడి ఏంటి.. చాట్ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ రెసిపీ చూసేయ్యాల్సిందే.
బ్రెడ్ పకోడా చాట్
బ్రెడ్ పకోడా చాట్

బ్రెడ్ పకోడా చాట్

Bread Pakodi Chat Recipe : వీకెండ్ ఉదయాన్ని కానీ.. చల్లని సాయంత్రాన్ని కానీ.. అదిరే ఫుడ్​తో కొనసాగించాలి అనుకుంటే బ్రెడ్ పకోడా చాట్​ని ట్రై చేయాల్సిందే. దీనిని తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఈ వీకెండ్​కి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే.. మీరు దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

కావాల్సిన పదార్థాలు

* బ్రెడ్ - 4

* బంగాళదుంపలు - 3

* పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)

* ఉప్పు - రుచికి తగినంత

* పెప్పర్ - రుచికి తగినంత

* గరం మసాలా - అర టీ స్పూన్

* పుదీనా - 1 స్పూన్

* దానిమ్మ గింజలు - 2 టేబుల్ స్పూన్స్

* కారం - అర టీ స్పూన్

* శెనగపిండి - 1 కప్పు

* నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత

తయారీ విధానం

ఓ గిన్నె తీసుకుని దానిలో ఉడికించిన బంగాళ దుంపలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, మసాలా వేసి బాగా కలపండి. రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని.. వాటిని ఆలు మిశ్రమంతో స్టఫ్ చేయండి. ఈ బాల్స్ పక్కన పెట్టి.. ఓ గిన్నె తీసుకోండి. దానిలో శెనగపిండి, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలపండి. పిండి పలుచగా కాకుండా చిక్కగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు బ్రెడ్ బాల్స్​ను పిండిలో ముంచి.. వాటిని డీప్​ ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత.. బయటకు తీసి నాలుగు సమాన భాగాలుగా కట్ చేయండి. వాటి మీద పెరుగు, పుదీనా చట్నీ వేయాలి. దాని పైన సేవ్, దానిమ్మ గింజలు, కొత్తిమీర ఆకులు వేసి.. గార్నిష్ చేయండి. ఈ బ్రెడ్ పకోడి చాట్ మిమ్మల్ని అస్సలు నిరుత్సాహపరచదు.

టాపిక్