తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Dosa For Breakfast : గరం గరంగా ఎగ్ దోసె లాగించేయండి

Egg Dosa For Breakfast : గరం గరంగా ఎగ్ దోసె లాగించేయండి

HT Telugu Desk HT Telugu

23 April 2023, 6:30 IST

    • Egg Dosa For Breakfast : ఇంట్లోనే దోసె తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మీ ఇంట్లో గుడ్లు ఉన్నాయా? ఆ కోడిగుడ్లతో ఎగ్ దోసెను రుచికరంగా చేసి తినండి. ఈ ఎగ్ దోసెను రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఏ సైడ్ డిష్ అవసరం లేదు.
ఎగ్ దోసె
ఎగ్ దోసె

ఎగ్ దోసె

దోసెను కొంతమంది ఇష్టంగా తింటారు. అయితే బయటకు వెళ్లి తినే బదులుగా ఇంట్లోనే చేసేయండి. ఎగ్ తో చేసే దోసె తినేందుకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనూ రెండు రకాల దోసెలు ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా వాటిని తయారు చేసి తినండి.

ట్రెండింగ్ వార్తలు

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

World lupus day 2024: శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే వ్యాధి లూపస్, ఇదొక విచిత్రమైన ఆరోగ్య సమస్య

Curd and Diabetes: రోజూ కప్పు పెరుగు తింటే డయాబెటిస్ మాత్రమే కాదు ఈ వ్యాధులను రాకుండా అడ్డుకోవచ్చు

వెరైటీ-1కు కావాల్సిన పదార్థాలు

దోస పిండి-2 కప్పులు , గుడ్డు - 4, ఉల్లిపాయ - 1/2 కప్పు (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - 2, టొమాటోలు - 1/4 కప్పు (సన్నగా తరిగినవి), ఉప్పు - రుచి ప్రకారం, మిరియాల పొడి - రుచి ప్రకారం, నూనె - కావలసిన పరిమాణం.

ముందుగా ఒక గిన్నెలోకి గుడ్లు పగలగొట్టి అందులో ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. తర్వాత స్టౌవ్ మీద దోసె పాన్ పెట్టాలి. ఇప్పుడు అది వేడి అయ్యాక.. దానిపై దోసె పిండితో దోసె పోయాలి. దోసె మీద గుడ్డు మిశ్రమాన్ని పోసేయాలి. దోసెకు అంతటా చెంచాతో రుద్దాలి. కాసేపు అలాగే ఉంచితే.. ఎగ్ దోసె రెడీ.

వెరైటీ-2కు కావాల్సిన పదార్థాలు

దోస పిండి - 2 కప్పులు, గుడ్డు - 3, పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), ఉప్పు - రుచి ప్రకారం, మిరియాల పొడి - రుచి ప్రకారం, నూనె - కావలసిన పరిమాణం

ముందుగా ఒక గిన్నెలోకి గుడ్లు పగలగొట్టి అందులో ఉల్లిపాయ వేసి బాగా కలపాలి. తర్వాత స్టౌవ్ మీద దోసె పాన్ పెట్టాలి. వేడయ్యాక, ఒక చెంచా దోసె పిండి పోసి, దానిపైన కలిపిన గుడ్డులో సగం పోయాలి. తర్వాత దోసెలాగా అనాలి. పైన కొంచెం ఉప్పు, మిరియాల పొడి చల్లి, నూనె పోసి, దీన్ని రెండు వైపులా ఉడికించండి. అప్పుడు రుచికరమైన గుడ్డు దోసె సిద్ధం అవుతుంది.