Mosambi Benefits : బత్తాయిలు తిన్నా.. తాగినా.. ఆరోగ్యానికి మంచివేనట.. ముఖ్యంగా ఆ సమస్యలున్నవారికి..
17 November 2022, 16:35 IST
- Sweet Lime Benefits : చలికాలంలో అందాన్ని, ఆరోగ్యాన్నిచ్చే బత్తాయిలను డైట్లో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. వీటిలోని పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
రోజూ మోసంబీ తినండి.. లేదా తాగండి..
Sweet Lime Benefits : బత్తాయిలు స్వీట్గా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎవరైనా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. విటమిన్లు A, C, డైటరీ, ఫైబర్, ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలతో బత్తాయిలు నిండి ఉంటాయి. అయితే వీటిని చలికాలంలో తీసుకుంటే జలుబు చేస్తుందని కొందరు భావిస్తారు కానీ.. జలుబును కూడా నయం చేసే సత్తా.. బత్తాయిలకు ఉంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇంతకీ వాటి వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన జీర్ణక్రియకై..
బత్తాయిలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఫ్లేవనాయిడ్స్‌తో నిండి ఉంటాయి. ఇవి జీర్ణ రసాలు, పిత్తం, ఆమ్లాల స్రావాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కూడా సహాయం చేస్తాయి.
రోగనిరోధక శక్తికై..
బత్తాయిలోని విటమిన్ సి, ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ల అధిక కంటెంట్ మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయం చేస్తుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన, బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది.
దీనిలోని విటమిన్ సి.. దగ్గు, జలుబు, జ్వరం, వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది.
జుట్టు, చర్మ సంరక్షణకై..
విటమిన్ సి మీ చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయం చేస్తుంది. మీ చర్మపు రంగును కాంతివంతంగా మారుస్తుంది. పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలను తగ్గించి ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని అందిస్తుంది.
గుండె ఆరోగ్యానికై
బత్తాయి మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అవసరమైన పోషకాలతో నిండి ఉన్న బత్తాయి.. ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది. గుండె రక్తాన్ని సాఫీగా రవాణా చేయడానికి సహాయపడుతుంది.
ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. మూత్రపిండాల్లోని రాళ్లను కూడా నివారిస్తుంది. ఇనుము శోషణకు సహాయం చేస్తుంది.
కిడ్నీలకు డిటాక్సిఫై
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సలో బత్తాయి బాగా సహాయపడుతుంది. ఇది అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు ఇబ్బందికి దారితీస్తుంది. బత్తాయిలో పొటాషియం అధికంగా ఉండటం వలన మూత్రాశయం, మూత్రపిండాలు పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. UTI లక్షణాలతో పోరాడటానికి సహాయం చేస్తాయి. ఇది మూత్రాశయ ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తుంది. మీ మూత్రపిండాలను నిర్విషీకరణ చేస్తుంది.