Scrub Typhus Fever : దేశంలో మరో కొత్త జ్వరం.. లక్షణాలు ఇవే.. ప్రమాదమే అంటున్న వైద్యులు-scrub typhus fever in india here is the symptoms and facts in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Scrub Typhus Fever : దేశంలో మరో కొత్త జ్వరం.. లక్షణాలు ఇవే.. ప్రమాదమే అంటున్న వైద్యులు

Scrub Typhus Fever : దేశంలో మరో కొత్త జ్వరం.. లక్షణాలు ఇవే.. ప్రమాదమే అంటున్న వైద్యులు

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 28, 2022 08:29 AM IST

Scrub Typhus Fever : దేశంలో కొత్త జ్వరం ఎంట్రీ ఇచ్చింది. రకరకాల వైరస్లు ఇండియాను ఎటాక్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ స్క్రబ్ టైఫస్ అనే జ్వరం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసులు తక్కువగానే ఉన్నా.. దీనిని అంత తేలికగా తీసుకోలేమని వైద్యులు చెప్తున్నారు. మరి దీని లక్షణాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటివి ఇప్పుడు తెలుసుకుందాం.

<p>స్క్రబ్ టైఫస్ జ్వరం</p>
<p>స్క్రబ్ టైఫస్ జ్వరం</p>

Scrub Typhus Fever : వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి సరిపోవు అన్నట్లు స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం వచ్చింది. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా అరుదుగా సంభవించినప్పటికీ.. ఈ జ్వరం చాలా కాలం పాటు కొనసాగితే.. బహుళ అవయవ వైఫల్యానికి దారితీస్తుంది అంటున్నారు డాక్టర్ అతుల్. అంతేకాకుండా రోగి మరణానికి కూడా దారితీయవచ్చు అంటున్నారు.

స్క్రబ్ టైఫన్​ అనే జ్వరం ఒక నిర్దిష్ట రకం క్రిమి (టిక్) కాటు వల్ల వస్తుంది. ఈ పేలు సాధారణంగా పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి. అదనంగా ఇవి పొదలు, పొలాలలో కనుగొనవచ్చు. ప్రస్తుతం దిల్లీలో ఈ జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించారు. వారిలో పిల్లలు, వృద్ధులే ఎక్కువ ఉన్నారని వైద్యులు వెల్లడించారు. క్రిమి కాటు నుంచి కనిపించే గుర్తు లేదా మచ్చ ఒక హెచ్చరిక సంకేతం అంటున్నారు. స్క్రబ్ టైఫస్ అనేది ఒక ప్రత్యేకమైన వ్యాధి.

నివేదికల ప్రకారం.. ద్వారక నుంచి దిల్లీ వచ్చిన ఓ పిల్లవాడిలో ఈ జ్వరాన్ని కనుగొన్నారు. ఈ వ్యాధి సాధారణంగా అధిక స్థాయి జ్వరానికి కారణం కాదు. అయినా అది ప్రమాదకరమే. అందుకే ఇలాంటి జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం దాని కొన్ని లక్షణాలు డెంగ్యూని పోలి ఉంటాయి.

స్క్రబ్ టైఫస్ లక్షణాలు

డెంగ్యూ మాదిరిగానే.. స్క్రబ్ టైఫస్​తో బాధపడే రోగి శరీరంపై దద్దుర్లు వస్తాయి. జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ జ్వరం సాధారణంగా ఏడు రోజులు ఉంటుంది. కొంతమంది రోగుల్లో శ్వాసలోపం కారణంగా.. బహుళ అవయవ వైఫల్యం సంభవించే అవకాశం ఉంది. అటువంటి సందర్భాలలో వెంటిలేటర్, ఐసీయూ అవసరం. సకాలంలో పరిష్కరించకపోతే ప్రాణం కూడా పోవచ్చు.

సంబంధిత కథనం

టాపిక్