Dengue Fever Prevention : డెంగ్యూ వచ్చినా.. రాకపోయినా ఈ జాగ్రత్తలు తీసుకోండి..-dengue fever symptoms and prevention and curing tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dengue Fever Prevention : డెంగ్యూ వచ్చినా.. రాకపోయినా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Dengue Fever Prevention : డెంగ్యూ వచ్చినా.. రాకపోయినా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 27, 2022 12:45 PM IST

Dengue Fever Prevention : దేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరం కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూను నివారించడానికి.. కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. డెంగ్యూ, లక్షణాలు, నివారణ చిట్కాలు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డెంగ్యూ లక్షణాలు
డెంగ్యూ లక్షణాలు

Dengue Fever Prevention : భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరం కేసులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి వాతావరణంలో మార్పులు కారణంగా దోమలతో పాటు.. డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. నీటి నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల దోమలు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ వ్యాధి సంక్రమించడానికి ప్రధాన మార్గం ఏడిస్ దోమ కాటు. డెంగ్యూ వచ్చినప్పుడు రోగిలో ప్లేట్‌లెట్స్ త్వరగా పడిపోతాయి. రోగి ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే మరణం కూడా సంభవించవచ్చు.

ఆరోగ్య సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలో సాధారణంగా 1.5 లక్షల నుంచి 4 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. డెంగ్యూ జ్వరం సమయంలో ఈ ప్లేట్‌లెట్స్ 50,000 కంటే తక్కువకు పడిపోయినప్పుడు.. రోగి ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించాలి.

డెంగ్యూ లక్షణాలు

* తీవ్ర జ్వరం

* దద్దుర్లు

* అసౌకర్యం

* కండరాల నొప్పి

* వాంతులు

* వికారం

* తీవ్రమైన తలనొప్పి

డెంగ్యూ నివారణ చర్యలు

నీటి నిల్వ కంటైనర్లను సరైన మూతతో కప్పండి.

ప్రతి వారం కూలర్లు, ఓపెన్ వాటర్ నిల్వ ఉన్న ఇతర ప్రదేశాలలో నీటిని శుభ్రం చేయండి. లేదా మార్చండి.

దోమ కాటును నివారించడానికి మీరు పగటిపూట ఏరోసోల్‌ను ఉపయోగించవచ్చు.

మీ చేతులు, కాళ్ళను కప్పి ఉంచే దుస్తులను ధరించండి.

నిద్రపోతున్నట్లయితే.. దోమతెరలు, రిపెల్లెంట్లను ఉపయోగించండి.

డెంగ్యూ నివారణలు

1. హైడ్రేటెడ్​గా ఉండండి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రోగి శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.

2. ఆకు కూరలు తినండి. రోగులు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లయితే ఆకు కూరలు తినాలి.

3. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి. పోషకాలు ఎక్కువగా ఉండే, సులభంగా జీర్ణమయ్యే ఆహార ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మంచిది. మిక్స్డ్ వెజిటబుల్ కిచ్డీ, వోట్మీల్, కాయధాన్యాలు వంటి ఆహారాలను తీసుకోవడం బెటర్.

4. మీ ఆహారం రుచిని మెరుగుపరచాలనుకుంటే.. దానిలో తులసి ఆకులు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, నిమ్మ వంటి పదార్థాలను చేర్చుకోవచ్చు.

5. మేక పాలు తీసుకోండి. డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో మేక పాలు ముఖ్యంగా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్