కుంకుమాది తైలం నిజంగానే గ్లో ఇస్తుందా? మొటిమలు ఉన్నా అప్లై చేయవచ్చా?-all about kumkumadi oil here is details and benefits with saffron oil for skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కుంకుమాది తైలం నిజంగానే గ్లో ఇస్తుందా? మొటిమలు ఉన్నా అప్లై చేయవచ్చా?

కుంకుమాది తైలం నిజంగానే గ్లో ఇస్తుందా? మొటిమలు ఉన్నా అప్లై చేయవచ్చా?

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 16, 2022 05:30 PM IST

Kumkumadi Oil Benefits for Skin : ఇటీవల కాలంలో ఏ ఇన్​ఫ్లూయన్స్​ర్​ని చూసినా.. లేదా యూట్యూబర్​ని చూసినా.. కుంకుమాది తైలం గురించి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ల సౌందర్యానికి కుంకుమాది నూనె కారణం అంటున్నారు. ఇంతకీ అది ఎంతవరకు నిజం? నిజంగానే దీనితో అంత గ్లో వస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

కుంకుమపువ్వు తైలం బెనిఫిట్స్
కుంకుమపువ్వు తైలం బెనిఫిట్స్

Kumkumadi Oil Benefits for Skin : కుంకుమాది తైలం. దీనిని కుంకుమపువ్వు తైలం అని కూడా పిలుస్తారు. ఇది ఎప్పటినుంచో దీనిని ఆయుర్వేద అమృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది అనేక చర్మ సమస్యలు, రుగ్మతలు నివారిస్తూ.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విదేశంలోనే కాదు.. స్వదేశీ అందాల విభాగంలో కూడా ఇది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. మరి ఈ కుంకుమాది తైలాన్ని ఎవరు ఉపయోగించవచ్చు. ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చో.. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంకుమాది నూనెను ఎవరు ఉపయోగించవచ్చు?

"కుంకుమాది నూనె బహుశా మార్కెట్‌లో లభించే అత్యంత శక్తివంతమైన నూనెలలో ఒకటి. ఇది అనేక చర్మ సమస్యలను పరిష్కరించే ఓ అద్భుతమైన నూనెగా చెప్పవచ్చు. దాదాపు ప్రతి చర్మ రకానికి ఇది సమానంగా పని చేస్తుంది. సుసంపన్నమైన పోషకాలతో ఇది నిండి ఉంది." అని నిపుణులు తెలిపారు.

"మొటిమల బారిన పడే చర్మం ఉన్న వ్యక్తులకు లేదా సులభంగా మూసుకుపోయే చర్మ రంధ్రాలకు ఉన్నవారికి ఇది అంత మంచిగా ఉండదు. ఎందుకంటే ఇది సహజంగా వేడిగా ఉంటుంది. దానివల్ల అది మొటిమల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది." అని నిపుణులు వెల్లడిస్తున్నారు.

కుంకుమాది నూనెను ఎలా ఉపయోగించాలి?

కుంకుమాది నూనె చర్మం ద్వారా సులభంగా లోపలికి చొచ్చుకుపోతుంది. అయినప్పటికీ ఇది చర్మానికి స్వయంగా వర్తించదు. దాని వేడి స్వభావం కారణంగా.. ఉత్తమ ఫలితాలను పొందడానికి దానిని బాదం నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి అప్లై చేసుకోవాలి.

10 చుక్కల స్వచ్ఛమైన కుంకుమది ఎసెన్షియల్ ఆయిల్‌ను.. 10 మి.లీ బాదం ఆయిల్‌తో మిక్స్ చేసి.. రాత్రంతా దానిని సీరమ్​ వలె అప్లై చేయవచ్చు. మూలికలతో కుంకుమాది తైలం కలపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కుంకుమాది నూనెను మాయిశ్చరైజర్ లేదా మసాజ్ క్రీమ్‌తో కూడా కలపవచ్చు. ఇలా చేస్తే మాయిశ్చరైజర్ లేదా మసాజ్ క్రీమ్ శోషణ, నిలుపుదల పెరుగుతుంది. "కుంకుమది ఎసెన్షియల్ ఆయిల్ ప్రయోజనాలను మరింత పెంచడానికి.. చాలా మంది నిపుణులు ఒకదానికొకటి పూరకంగా ఉండే కొన్ని మూలికలను కలపాలని సూచిస్తున్నారు. స్టార్ సోంపు, పచ్చి సోపు గింజలు, లికోరైస్, యాలకులు, కొంతవరకు పుదీనా ఆకులు వంటి మూలికలను దీనిలో చేర్చవచ్చు" అని నిపుణులు తెలిపారు.

కుంకుమపువ్వు నూనె మీ చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది..

ఈ నూనె మీరు ఆశించే ప్రయోజనాలు ఇవ్వడంలో మీకు మంచి భరోసా ఇస్తుంది. కుంకుమాది నూనెను అప్లై చేయడం ద్వారా.. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించవచ్చు. ఇది హైపర్పిగ్మెంటేషన్, చిన్న చిన్న మచ్చలు, మెటిమల తర్వాత వచ్చే మచ్చలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. కుంకుమాది తైలం.. ముఖం ఉబ్బరం, అకాంథోసిస్ నైగ్రికాన్స్, స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది.

స్వచ్ఛమైన, కల్తీ మధ్య తేడాను ఇలా గుర్తించండి..

స్వచ్ఛమైన కుంకుమాది ఎసెన్షియల్ ఆయిల్, అశుద్ధ మిశ్రమం మధ్య తేడాను గుర్తించడానికి రెండు పారామితులు ఉన్నాయి. కుంకుమాది నూనెను ఉపయోగించిన తర్వాత మీరు రాత్రికి రాత్రే తేడాను గుర్తించగలుగుతారు.

చాలా మంది వాణిజ్య విక్రయదారులు కుంకుమపువ్వు సువాసనను నిలుపుకోవడానికి తమ నూనెను కృత్రిమ సువాసనలు, క్యాన్సర్ కారకాలతో కలుపుతారు. అయితే స్వచ్ఛమైన కుంకుమది నూనె.. అప్లికేషన్ తర్వాత కేవలం 5-10 నిమిషాల తర్వాత దాని సువాసనను కోల్పోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం