Fruits: భోజనం చేశాక పండ్లు తినడం మంచి పద్ధతేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Fruits: భోజనం తర్వాత పండ్లు తినే అలవాటు ఎంతోమందికి ఉంది. ఇది మంచి అలవాటుగా కూడా ఎంతో మంది భావిస్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదం పండ్లు తినేటప్పుడు కొన్ని పొరపాట్లను నివారించాలని ఆయుర్వేదం చెబుతుంది, వాటిలో ఒకటి ఆహారంతో తినడం. పండ్లను ఆహారంతో పాటు తినడం వల్ల కలిగే అనర్థాలేంటో తెలుసుకుందాం.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యసమస్యలు రావు. కానీ అవి తినేందుకు కూడా ఒక సమయం ఉంది. వాటని తిన కూడని సమయంలో తింటే కొన్ని ఆరోగ్య అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఏ సమయంలో పండ్లు తినకూడదో ఆయుర్వేదం చెబుతోంది.
పండ్లలో ఉండే మినరల్స్, ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక రకాల పోషకాలు ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను ఇస్తాయి. కానీ ఆయుర్వేదం ప్రకారం, భోజనం తరువాత మాత్రం పండ్లు తినకూడదు. ఈ ఆహార నియమాలను పాటించడంలో విఫలమవడం లేదా పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినడం ద్వారా శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. దీనిని ‘అమా’ అని పిలుస్తారు. ఇది అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను ఆహ్వానిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పండ్లు తినేటప్పుడు కొన్ని పొరపాట్లను నివారించాలని చెబుతోంది. పండ్లను ఆహారంతో పాటు తినడం వల్ల కలిగే అనర్థాలేంటో తెలుసుకుందాం.
భోజనం చేశాక పండ్లు తినడం వల్ల శరీరానికి పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ ఆహారంలో ఉండే పోషకాల శోషణను అడ్డుకుంటుంది. భోజనం తిన్న వెంటనే పండ్లు తినడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది.
టాక్సిన్స్ పేరుకుపోవడం
భోజనం చేశాక పండ్లు తినడం వల్ల శరీంలో టాక్సిన్లు పేరుకుపోవడం ప్రారంభమవుతాయి. దీని వల్ల తిన్న వ్యక్తికి గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. తిన్న తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఒత్తిడికి గురి చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది.
ఎసిడిటీ
ఆహారం తిన్న వెంటనే పండ్లు తినడం వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు, టమోటాలు వంటి సిట్రస్ పండ్లలో ఉండే ఆమ్లాలు కడుపులో ఎసిడిటీ స్థాయిని పెంచుతాయి. వాటిలో ఉండే ఆమ్లాలు అన్నవాహిక స్పింక్టర్ను సడలించి యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ఈ పండ్ల రసాలు కూడా ఎసిడిటీకి కారణం కావచ్చు. కాబట్టి భోజనం చేశాక పండ్లు తినేందుకు మధ్యలో గంట లేదా గంటన్నర గ్యాప్ ఉండేలా చూసుకోండి.
తలనొప్పి
భోజనం తిన్న తర్వాత పండ్లు తినడం వల్ల తలనొప్పి వస్తుంది. ఈ పండ్లలో ఉండే యాసిడ్, సహజ చక్కెర తలనొప్పికి కారణమవుతాయి. సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. మీకు మైగ్రేన్ సమస్య ఉంటే కొన్ని రకాల పండ్లను దూరంగా ఉంచాలి. సిట్రస్ పండ్లు, అవోకాడోస్, రేగు పండ్లు వంటివి తినకూడదు.
భోజనం చేశాక ఏవీ తినకపోవడమే మంచిది. అప్పుడే ఆ ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించుకుంటుంది. కొంతమంది భోజనం తిన్నాక టీ, కాఫీ వంటివి తాగుతూ ఉంటారు. అలా తాగడం కూడా ఏమాత్రం మంచిది కాదు.
అత్తి పండ్లు మరియు ఎండిన పండ్లను తినడం మానుకోండి.