iPhone 16 Pro: భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో ధర; ఇలా సొంతం చేసుకోండి..
iPhone 16 Pro: ఐఫోన్ ఫ్లాగ్ షిప్ మోడల్ ఐఫోన్ 16 ప్రొ ధర భారీగా తగ్గింది. ఇప్పుడు మీరు ఐఫోన్ 16 ప్రో 256 జిబి మోడల్ ను అమెజాన్ లో రూ .1,21,030 ల అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది ఐఫోన్ 16 ప్రో 128 జిబి మోడల్ కంటే కేవలం రూ .1,000 ఎక్కువ. ఈ డీల్ ను ఎలా సొంతం చేసుకోవాలంటే..?
iPhone 16 Pro discount: అమెజాన్ లో 128 జీబీ వెర్షన్ ధరకే లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రో 256 జీబీ మోడల్ ను పొందవచ్చు. అమెజాన్ లో లభిస్తున్న వివిధ ఆఫర్ లను తెలివిగా ఉపయోగించి, ఐఫోన్ 16 ప్రో 256 జీబీ మోడల్ ను అత్యంత ఎఫెక్టివ్ ధరకు సొంతం చేసుకోవచ్చు. అన్ని ఆఫర్లను ఉపయోగించుకుని ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.1,21,000 వరకు పొందవచ్చు.
రూ.1,21,030కే ఐఫోన్ 16 ప్రో పొందడం ఎలా?
అమెజాన్ లో ఐఫోన్ 16 ప్రో 256 జిబి మోడల్ రెగ్యులర్ ధర రూ .1,29,900 గా ఉంది. అయితే, అమెజాన్ ఐసీఐసీఐ పే క్రెడిట్ కార్డును ఉపయోగించి, ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే, రూ .2,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అప్పుడు దీని ధర రూ .1,27,400 కు తగ్గుతుంది. ఇప్పుడు, మీరు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోకుండా పూర్తి మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని నిర్ణయించుకుంటే, మీరు అమెజాన్ ప్రైమ్ (amazon prime) మెంబర్ అయితే అదనంగా 5% క్యాష్ బ్యాక్ పొందడానికి అర్హులవుతారు. మీ బిల్లింగ్ సైకిల్ తర్వాత ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది. అంటే, ఈ షరతులను పాటిస్తే రూ.6,370 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ తో మీకు ఐఫోన్ (IPhone) 16 ప్రో రూ.1,21,030 లకే లభిస్తుంది. ఇది ఐఫోన్ 16 ప్రో 128 జీబీ మోడల్ ధరతో దాదాపు సమానం.
ఫ్రెండ్ కార్డు కూడా వాడుకోవచ్చు..
ఒకవేళ మీకు అమెజాన్ (amazon) ఐసిఐసిఐ పే క్రెడిట్ కార్డు లేనప్పటికీ, మీరు దానిని కలిగి ఉన్న స్నేహితుడి నుండి కార్డును తీసుకోవడం ద్వారా ఈ డీల్ నుండి ప్రయోజనం పొందవచ్చు. క్యాష్ బ్యాక్ కొన్ని రోజుల తరువాత క్రెడిట్ అవుతుందని గమనించండి.
ఐఫోన్ 16 ప్రో హైలైట్స్
చాలా తక్కువ ఫోన్లు ఐఫోన్ అందించే వీడియో నాణ్యతను అందిస్తాయి. ముఖ్యంగా ప్రోరెస్ లాగ్ లో 4కె 120 ఎఫ్పిఎస్ వీడియోతో. ఇది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఐఫోన్. ఇది టాప్-టైర్ కెమెరా సిస్టమ్ ఉన్న అత్యంత క్వాలిటీ డివైజ్ అనడంలో అతిశయోక్తి లేదు. దీని కెమెరా సెటప్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మాదిరిగానే ఉంటుంది. అంటే మీరు అదే ఆప్టిక్స్, అదే 5 ఎక్స్ టెలిఫోటో లెన్స్ పొందుతారు. ముఖ్యంగా ఐక్లౌడ్ వాడితే చాలా మంది యూజర్లకు 256 జీబీ సరిపోతుంది. కాబట్టి, ఐఫోన్ 16 ప్రో 256 జీబీని సుమారు రూ .1,21,000 కు పొందడం ఖచ్చితంగా వ్యాల్యూ ఫర్ మనీనే అవుతుంది.
టాపిక్