మార్కెట్‌లోకి వచ్చిన 6 నెలల్లో 94000 అమ్మకాలు, అందరికీ నచ్చే ఈ ఫేవరెట్ కారు ధర రూ .6.49 లక్షలే!-this updated maruti car sales 94000 in 6 months starting price at 6 49 lakh rupees check this favourite car features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మార్కెట్‌లోకి వచ్చిన 6 నెలల్లో 94000 అమ్మకాలు, అందరికీ నచ్చే ఈ ఫేవరెట్ కారు ధర రూ .6.49 లక్షలే!

మార్కెట్‌లోకి వచ్చిన 6 నెలల్లో 94000 అమ్మకాలు, అందరికీ నచ్చే ఈ ఫేవరెట్ కారు ధర రూ .6.49 లక్షలే!

Anand Sai HT Telugu
Dec 11, 2024 02:00 PM IST

Maruti Suzuki Swift 2024 : మారుతి సుజుకి స్విఫ్ట్ భారతీయ వినియోగదారులకు ఎల్లప్పుడూ ఫేవరెట్‌గా ఉంటుంది. కంపెనీ మే 2024లో స్విఫ్ట్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ కారు అమ్మకాల్లోనూ జోరు కొనసాగించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ 2024
మారుతి సుజుకి స్విఫ్ట్ 2024

మారుతి సుజుకి స్విఫ్ట్ కారుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎల్లప్పుడూ ఈ కారు ఎక్కువగా అమ్ముడవుతుంది. మారుతి కంపెనీ మే 2024లో స్విఫ్ట్ అప్డేటెడ్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. దీనికి వినియోగదారుల నుండి మంచి గొప్ప స్పందన లభిస్తోంది. 2024 జూన్-నవంబర్ మధ్యలో అంటే లాంచ్ అయిన 6 నెలల్లోనే 94,000 మందికి పైగా కస్టమర్లను సొంతం చేసుకుంది. ఈ కాలంలో మారుతి స్విఫ్ట్ నెలవారీ అమ్మకాలు, దాని ఫీచర్ల గురించి చూద్దాం..

yearly horoscope entry point

కొత్త మారుతి స్విఫ్ట్ జూన్ నెలలో మొత్తం 16,422 మంది కస్టమర్లను అందుకుంది. జూలైలో స్విఫ్ట్ ను మొత్తం 16,854 మంది కొనుగోలు చేశారు. ఇది కాకుండా మారుతి స్విఫ్ట్ ఆగస్టు నెలలో మొత్తం 12,844 యూనిట్లను విక్రయించింది. సెప్టెంబర్‌లో స్విఫ్ట్ 16,241 కొత్త కస్టమర్లు ఈ కార్లను కొనుగోలు చేశారు. అక్టోబర్‌లో మొత్తం 17,539 మంది కొత్త స్విఫ్ట్‌ను కొనుగోలు చేశారు. అదే సమయంలో స్విఫ్ట్ నవంబర్‌లో మొత్తం 14,737 మంది కస్టమర్లను పొందింది. ఈ ఆరు నెలల కాలంలో మారుతి సుజుకి స్విఫ్ట్‌కు మొత్తం 94,637 మంది కస్టమర్లు వచ్చారు.

అప్డేట్ చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్ పవర్ట్రెయిన్ చూస్తే.. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 82 బీహెచ్పీ శక్తిని, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో జతచేసి ఉంటుంది. స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో లీటరుకు 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి స్విఫ్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

అప్డేటెడ్ మారుతి స్విఫ్ట్ క్యాబిన్‌లో వినియోగదారులు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను పొందుతారు. భద్రత కోసం స్టాండర్డ్ 6-ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను కారులో అందించారు. అప్డేటెడ్ మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ .6.49 లక్షలు, టాప్-స్పెక్ మోడల్‌ రూ .9.69 లక్షల వరకు ఉంది.

Whats_app_banner