Kids Food: పిల్లలకు మీరు ఇలాంటి ఆహారాలు పెడితే వారి కంటి ఆరోగ్యం క్షీణిస్తుంది, జాగ్రత్త-if you give these foods to children their eye health will deteriorate be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Food: పిల్లలకు మీరు ఇలాంటి ఆహారాలు పెడితే వారి కంటి ఆరోగ్యం క్షీణిస్తుంది, జాగ్రత్త

Kids Food: పిల్లలకు మీరు ఇలాంటి ఆహారాలు పెడితే వారి కంటి ఆరోగ్యం క్షీణిస్తుంది, జాగ్రత్త

Haritha Chappa HT Telugu
Dec 11, 2024 10:30 AM IST

Kids Food: పిల్లల్లో కంటి చూపు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారి కంటిచూపుకు మేలు చేసే ఆహారాన్ని పిల్లలకు తినిపించాలి. కొన్ని రకాల పదార్థాలు వారి చేత తినిపించడం వల్ల వారి కంటి పనితీరుపై నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది.

పిల్లల కంటికి మేలు చేసే ఆహారాలు
పిల్లల కంటికి మేలు చేసే ఆహారాలు (Pixabay)

పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారికి ఏ ఆహారాలు మేలు చేస్తాయో, ఏవి కీడు చేస్తాయో తెలియదు. కాబట్టి వారికి పెట్టే ఆహారాన్ని పేరెంట్స్ జాగ్రత్తగా ఎంపిక చేసి పెట్టాలి. ఇప్పటి పిల్లలకు జంక్ ఫుడ్ పట్ల ఇష్టం ఎక్కువగా ఉంటోంది. పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ అంటే వారికెంతో ఇష్టం. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లో, మధ్యాహ్నం భోజనంలో కూడా నూడుల్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జాలు, బర్గర్లు పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. ఇలా వారికి ఫాస్ట్ ఫుడ్ పెట్టడం వల్ల దీర్ఘకాలంలో వారికి గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవాకాశం ఉంది. కొంతకాలం క్రితం జంక్ ఫుడ్ విపరీతంగా తిని బ్రిటన్ లోని 17 ఏళ్ల టీనేజర్ అంధుడిగా, చెవిటివాడిగా మారాడు. అతడు జంక్ ఫుడ్ తప్ప మరేమీ తినేవాడు కాదు. దీని వల్ల అతనికి పోషకాహార లోపం వచ్చి ఆరోగ్య సమస్యల బారిన పడ్డాడు.

పిల్లలు జంక్ ఫుడ్ తింటే

జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం ముప్పు పెరగిపోతుంది. అలాగే వారి కంటిచూపుపై కూడా తీవ్రంగా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వారిలో నాడీ వికాసం, మెరుగైన రోగనిరోధక శక్తి కోసం పోషకాహారాన్ని ఇవ్వాలని వైద్యులు తరచూ సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు తరచుగా దృష్టి లోపం, బలహీనమైన కండరాలు, నాడీ అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. పోషకాహారలోపం మరీ అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఒక బిడ్డ పుట్టాక కొన్ని నెలల పాటూ వారి కంటి చూపు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి వారికి పోషకాహారాన్ని ఇస్తూ ఉండాలి. అన్నం తినే వయసుకు వచ్చాక జంక్ ఫుడ్ ఇవ్వకుండా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ నిండిన ఆహారాలు, ఆకుకూరలు అధికంగా పెట్టాలి.

జంక్ ఫుడ్ లో సోడియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది. దీనివల్ల పిల్లల కళ్ల నిర్మాణం దెబ్బతింటుంది. ఇది అస్పష్టమైన దృష్టి, కంటి లోపల రక్తస్రావం లేదా గ్లాకోమాకు దారితీస్తుంది. ఇది కొన్నిసార్లు దృష్టి నష్టం లేదా అంధత్వానికి దారితీస్తుంది.

రెటీనాకు దెబ్బ

సెంట్రల్ సెరస్ కొరియోరెటినోపతి (సిఎస్సి) అనేది రెటీనా క్రింద ద్రవం పేరుకుపోయే పరిస్థితి. కోరాయిడ్ అనేది రెటీనాకు పోషకాలను అందించే రక్త నాళాల పొర. ఆ సమస్య కారణంగా సాధారణంగా ఒక కంటిని ప్రభావితం చేస్తుంది, కానీ కొన్నిసార్లు రెండు కళ్ళు కూడా ప్రభావితమవుతాయి. అస్పష్టమైన దృష్టి లేదా నల్ల మచ్చలు వంటి దృష్టి లోపానికి కారణమవుతుంది.

బలహీనమైన రక్త నాళాలు

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్లు, ఖనిజాలు ముఖ్యమైనవి. పోషకాహార లోపం వస్తే కంటి కణజాలాలు బలహీనపడటానికి దారితీస్తాయి. ఇది కార్నియల్ క్షీణత లేదా బలహీనమైన రక్త నాళాలు వంటి సమస్యలకు దారితీస్తుంది.

వీటిని పెట్టకండి

ప్యాకేజ్డ్ ఫుడ్ పిల్లలకు తినిపించకండి. మయోన్నైస్, కెచప్, బార్బెక్యూ సాస్ వంటి కొవ్వు అధికంగా ఉండే వస్తువులను ఉపయోగించడం మానుకోండి. ఇవన్నీ చక్కెరలు, కొవ్వులతో నిండి ఉంటాయి. పిల్లలకి విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినడానికి ఇవ్వండి. ఇది మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు, కివి, పచ్చి క్యారెట్లు, ఆకుకూరలు వంటి వాటిని పిల్లల ఆహారంలో చేర్చవచ్చు.

Whats_app_banner