తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paratha Recipes: సత్తు పరాఠా.. మేతీ పరాఠా.. ఎగ్ పరాఠా.. వేడివేడిగా

Paratha recipes: సత్తు పరాఠా.. మేతీ పరాఠా.. ఎగ్ పరాఠా.. వేడివేడిగా

HT Telugu Desk HT Telugu

23 January 2023, 15:48 IST

    • Paratha recipes: వింటర్ సీజన్‌లో సత్తు పరాఠా, మేతి పరాఠా, ఎగ్ పరాఠా వేడివేడిగా తింటే అమోఘమే. ఈ పరాఠాల తయారీ విధానం, కావాల్సిన ఆహార పదర్థాలు ఇక్కడ తెలుసుకోండి.
పరాఠా సంప్రదాయక, బలవర్థకమైన వంటకం
పరాఠా సంప్రదాయక, బలవర్థకమైన వంటకం (pinterest)

పరాఠా సంప్రదాయక, బలవర్థకమైన వంటకం

ఒకవైపు చలి. మరోవైపు వెచ్చని పరాఠా! రుచికరమైన పరాఠాలను ఆస్వాదించడానికి శీతాకాలం మంచి సమయం. వీటిలో పోషక విలువలను పెంచడానికి ఇతర ఆహార పదార్థాలతో కలిపి చేయొచ్చు. చలికాలం రాత్రి భోజనానికి లేదా ఉదయం పూట అల్పాహారానికి సరైన ఎంపిక అని చెప్పొచ్చు. సాయంకాలమైన హాపీగా తినేయొచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే పరాఠాలు రుచికరమైనవి మాత్రమే కాదు.. చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. 

సత్తు పరాఠా… 

(రెసిపీ: చెఫ్ పంకజ్ భదౌరియా)

సత్తు పరాఠా

ప్రిపరేషన్ సమయం: 10 నిమిషాలు

వంట సమయం: 20 నిమిషాలు

ఎన్ని సత్తు పరాఠాలు: 2-3

సత్తు పరాఠాకు కావలసిన ఆహార పదార్థాలు:

పరాఠాలో నింపేందుకు

2 కప్పులు వేయించిన శనగలు  (పుట్నాల పప్పు)

5 వెల్లుల్లి రెబ్బలు (చిన్నగా కట్ చేయాలి)

2 ఉల్లిపాయలు (చిన్నగా కట్ చేయాలి)

1 అంగుళం సైజు అల్లం (సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)

3 పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి

2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు

2 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం

3 పచ్చి మిరపకాయలు (కట్ చేయాలి )

2 టేబుల్ స్పూన్ల పండు మిర్చి కారం

తగినంత ఉప్పు

2 టేబుల్ స్పూన్లు ఆవాల నూనె

ఫ్రై చేసేందుకు తగినంత నూనె

సత్తు పరాఠా పిండి కోసం:

2 కప్పులు గోధుమ పిండి

2 స్పూన్ల నెయ్యి

1/4 స్పూన్ ఉప్పు

1/2 టీస్పూన్ వాము

సత్తు పరాఠా చేసే విధానం

వేయించిన శనగలను గ్రైండర్‌లో గ్రైండ్ చేసి సత్తులా చేసుకోవాలి.

  1. స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకున్న ఆహార పదార్థాలన్నీ సత్తుతో కలిపేయాలి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీటిని చల్లి స్టఫింగ్ కాస్త తేమగా ఉండేలా, సులువుగా పరాఠాలో నింపేలా ఉంచుకోవాలి.
  2. గోధుమ పిండిని బాగా పిసికి అర టీస్పూన్ వాము కలపాలి. అలాగే నెయ్యి, ఉప్పు కలుపుకోవాలి. పిండి మృదువుగా ఉండేలా తగినంత నీళ్లు చల్లుకోవాలి.
  3. గోధుమ పిండి ముద్దను చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి.
  4. పిండిని చిన్న సైజు వృత్తాకారం(పూరీ తరహా)లో చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల స్టఫింగ్‌ని నింపేందుకు వీలుగా మధ్య భాగంలో అమర్చి ఫోల్డ్ చేసుకుని చపాతీ తరహాలో పరాఠా చేయాలి.
  5. తవాపై లేదా చదునుగా ఉన్న పాన్‌పై వేడి చేసుకోవాలి. రెండు వైపులా నూనె లేదా నెయ్యి చల్లుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేడి చేసుకోవాలి.
  6. అంతే సత్తు పరాఠా రెడీ. ఇక చట్నీ లేదా పెరుగుతో వడ్డించండి.

2. మేతీ పనీర్ పరాఠా

(రెసిపీ: చెఫ్ తార్లా దలాల్)

మేతి పనీర్ పరాఠా

ప్రిపరేషన్ సమయం: 10 నిమిషాలు

వంట సమయం: 20 నిమిషాలు

ఎన్ని మేతీ పనీర్ పరాఠాల : 4

మేతీ పనీర్ పరాఠా కోసం కావలసిన ఆహార పదార్థాలు

పిండి కోసం

3 కప్పుల గోధుమ పిండి

తగినంత ఉప్పు

మేతి పనీర్ స్టఫింగ్ కోసం

1/2 కప్పు సన్నగా తరిగిన మెంతి (మేతి) ఆకులు

1/2 కప్పు తురిమిన లో ఫ్యాట్ పనీర్ (కాటేజ్ చీజ్)

1/2 టీస్పూన్ జీలకర్ర (జీరా)

1/2 టేబుల్ స్పూన్ అల్లం-పచ్చిమిర్చి పేస్ట్

1/8 టీస్పూన్ పసుపు

1 స్పూన్ నూనె

తగినంత ఉప్పు

మేతి పనీర్ పరఠా తయారీ విధానం

1. గోధుమ పిండి, ఉప్పు కలపండి. తగినంత నీటిని ఉపయోగించి పిండిని కలపండి.

2. పిండిని తడి మస్లిన్ క్లాత్‌తో కప్పి 10 నిమిషాలు పక్కన పెట్టండి.

3. పిండిని 4 సమాన భాగాలుగా విభజించండి.

4. నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.

5. గింజలు చిట్లినప్పుడు మెంతి ఆకులు, పసుపు, ఉప్పు వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించి పక్కన పెట్టండి.

6. పనీర్ వేసి బాగా కలపాలి. స్టఫింగ్‌ను 4 సమాన భాగాలుగా విభజించండి.

7. కలిపిన గోధుమ పిండిలో ఒక భాగాన్ని సర్కిల్‌లో రోల్ చేయండి.

8. మేతీ పనీర్ స్టఫింగ్‌లో ఒక భాగాన్ని సర్కిల్ మధ్యలో ఉంచండి.

9. స్టఫింగ్‌ను కవర్ చేస్తూ పిండిని అన్ని వైపులా మూసేయండి.

10. చపాతీ కోలతో ఇప్పుడు పరాఠాను పరాఠా తయారు చేయండి.

11. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు నాన్-స్టిక్ తవా మీద వేడి చేసుకోవాలి. అంతే మేతి పనీర్ పరాఠా రెడీ.

12. అలాగే మిగిలిన పిండితో ఇంకో 3 మేతి పనీర్ పరాఠాలు చేసేయండి.

13. మేథీ పనీర్ పరాఠాలను వేడిగా సర్వ్ చేయండి.

 

3. ఎగ్ పరాఠా

(రెసిపీ: చెఫ్ కునాల్ కపూర్)

ఎగ్ పరాఠా

ఎగ్ పరాఠా చేసేందుకు సమయం: 20 నిమిషాలు

పరాఠాలు: 1

ఎగ్ పరాఠా తయారీకి కావలసిన ఆహార పదార్థాలు

1 గుడ్డు

1/2 పచ్చిమిర్చి (కట్ చేయాలి)

1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ (కట్ చేయాలి)

ఒక చిటికెడు ఉప్పు

1 టేబుల్ స్పూన్ కొత్తిమీర

1 గోధుమ పిండి

ఎగ్ పరాఠా తయారీ విధానం

1. ఒక గిన్నెలో గుడ్డు పగలగొట్టి అందులో ఉప్పు, పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయలు వేయాలి. దానిని విస్క్ చేయాలి.

2. గోధుమ పిండిని ఫ్లాట్‌గా, చాలా సన్నగా పరాఠా ఆకృతిలో రోల్ చేయాలి. తవా లేదా పాన్‌ను మధ్యస్థాయి మంటపై వేడి చేయాలి.

3. వేడి పాన్ మీద రోల్ చేసిన పిండిని ఉంచాలి. రెండు వైపులా ఒక నిమిషం పాటు వేడి చేయాలి.

4. ఇప్పుడు వేడిని తగ్గించి విస్క్ చేసి పెట్టుకున్న గుడ్డును పరాఠాపై పోయాలి. ఒక చెంచా ఉపయోగించి మొత్తం పరాఠాపై విస్తరించేలా చూడాలి.

5. అలా 30 సెకన్ల పాటు ఉడికించాలి. ఇప్పుడు పరాఠాను చతురస్రాకారంలా షేప్ చేయడానికి అన్ని వైపుల నుండి మధ్యలోకి మడతపెట్టండి.

6. సున్నితంగా నొక్కండి. నూనె చల్లుతూ దానిని తిప్పండి. మళ్లీ నూనె వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా ఉడికించాలి.

7. తీసేసి వేడివేడిగా చట్నీతో సర్వ్ చేయండి.