తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmastra Movie Tickets: రూ.75లకే బ్రహ్మాస్త్ర టికెట్లు.. ఎలాగో తెలుసా?

Brahmastra Movie Tickets: రూ.75లకే బ్రహ్మాస్త్ర టికెట్లు.. ఎలాగో తెలుసా?

02 September 2022, 17:00 IST

    • Movies Available for Low Fares: జాతీయ సినిమా దినోత్సవం- సెప్టెంబరు 16న దేశవ్యాప్తంగా సినిమా టికెట్లను రూ.75లకే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ సమయంలో బ్రహ్మాస్త్ర సినిమా కూడా విడుదల కానుండటంతో ఈ చిత్రం కూడా తక్కువ ధరకే వీక్షించవచ్చు.
బ్రహ్మాస్త్ర
బ్రహ్మాస్త్ర (Twitter )

బ్రహ్మాస్త్ర

Cinema Tickets Available for Low fares: బాలీవుడ్ దంపతులు ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రబృందం ఈ సినిమాపై ప్రమోషన్లను ముమ్మరంగా సాగిస్తోంది. మార్వెల్ యూనివర్స్ తరహాలో దర్శకుడు అయన్ ముఖర్జి అస్త్రావర్స్‌ను మాదిరిగా ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో మొదటి భాగం బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ శివ వచ్చే వారం రానుంది. తాజాగా ఈ సినిమాను అతి తక్కువ ధరకే వీక్షించే అవకాశముంది. ఊహించడానికి కూడా వీలు కాని రీతిలో అత్యంత చౌకగా రూ.75లకే వీక్షించవచ్చు. అవును మీరు విన్నది నిజమే!

ట్రెండింగ్ వార్తలు

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

మల్టిప్లెక్స్ అసోసియోషన్ ఆఫ్ ఇండియా(MAI) దేశవ్యాప్తంగా సినిమా టికెట్లను రూ.75లకే విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబరు 16న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఆ రోజు మల్టిప్లెక్సుల్లో సినిమా టికెట్టును కేవలం రూ.75లకే వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో దాదాపు 4 వేల థియేటర్ చైన్‌లు భాగమయ్యాయి.

దేశమంతటా ఆ రోజు తక్కువ ధరకే..

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయన్ ముఖర్జి తెరకెక్కించిన ఈ బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్లలో సెప్టెంబరు 9న విడుదల కానుంది. తొలిసారి ఆలియా, రణ్‌బీర్ కలిసి నటించిన చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. జాతీయ సినిమా దినోత్సవమైన సెప్టెంబరు 16నాడు రూ.75లకే దేశమంతటా సినిమా టికెట్లను రూ.75లకు విక్రయించనున్నారు. అదే సమయంలో బ్రహ్మాస్త్ర కూడా ఆడుతుంది కాబట్టి ఈ సినిమాను ఈ ధరకు వీక్షించే అవకాశముంది.

తక్కువ ధరకు టికెట్లను ఎందుకు విక్రయిస్తున్నారు?

జాతీయ సినిమా దినోత్సవం సెప్టెంబరు 16న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లు విజయవంతంగా పునఃప్రదర్శించడమే లక్ష్యంగా ఈ మేరకు టికెట్ రేట్లను ఆ ఒక్కరోజు తగ్గించారు. కరోనా మహమ్మారి తర్వాత సినిమా థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ రప్పించాలనే భావనతో ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఈ ఏడాది మంచి వసూళ్ను చూసింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2, విక్రమ్, భూల్ భూలియా 2 లాంటి భారీ విజయాలు నమోదయ్యాయి. అంతేకాకుండా డాక్టర్ స్ట్రేంజ్, టాప్ గన్ మావరిక్ లాంటి హాలీవుడ్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.