తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hbd Pawan Kalyan: తొలి ప్రేమ నుంచి భీమ్లా నాయక్ వరకు.. పవర్‌స్టార్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్.. చూస్తే వదిలిపెట్టరు..!

HBD Pawan Kalyan: తొలి ప్రేమ నుంచి భీమ్లా నాయక్ వరకు.. పవర్‌స్టార్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్.. చూస్తే వదిలిపెట్టరు..!

02 September 2022, 15:54 IST

    • Pawan Kalyan Five Power Packed Performances: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎన్నో అత్యుత్తమ చిత్రాలు ఉన్నాయి. అయితే ఆయన నటించిన కొన్ని చిత్రాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అంతేకాకుండా అందులో పవర్‌స్టార్ పర్ఫార్మెన్స్ కూడా విభిన్నంగా ఉంటుంది. ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
పవన్ కల్యాణ్ బెస్ట్ మూవీస్
పవన్ కల్యాణ్ బెస్ట్ మూవీస్ (Twitter)

పవన్ కల్యాణ్ బెస్ట్ మూవీస్

Pawan Kalyan Five Power Packed Performances: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు వింటేనే తెలుగునాట ఫ్యాన్స్ పునకాలతో ఊగిపోతారు.. ఆయన స్టైల్‌కు, మేనరిజానికి పులకరించింపోతారు.. ఆయన నటనకు, డైలాగులకు ఫిదా అయిపోతారు.. ఆయన వ్యక్తిత్వానికి దాసోహమంటారు. మొత్తంగా పవన్ పేరు వింటేనే పిచ్చెక్కిపోతారు. అందుకే పవర్ స్టార్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి మినీ యుద్ధమే చేస్తారు. ఆయనంటే అంత క్రేజ్.. ఇతర హీరోలకు పూర్తిగా విభిన్నమైన నటన, కథల ఎంపికతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాను మన పవర్ స్టార్. సినిమాలతోనే కాకుండా సామాజిక సేవ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి ఈ ఏడాది విడుదలైన 'భీమ్లా నాయక్' వరకు ఆయన ఎంచుకునే కథలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ఈ రోజు పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పవర్‌ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

Abhay Movie: థియేట‌ర్ల‌లో రిలీజైన 23 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్‌హాస‌న్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ!

Brahmamudi May 18th Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్ల నుంచి బయటపడిన కావ్య.. భార్యను కొట్టబోయిన రాజ్.. మరదలిపై ఫైర్

తొలి ప్రేమ..

పవన్ కల్యాణ్ సినీ కెరీర్ మొదటి నుంచి గమనిస్తే.. తొలి ప్రేమకు ముందు, తర్వాత అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఖాతాలో అన్నీ హిట్ సినిమాలే ఉన్నప్పటికీ తొలి ప్రేమ మాత్రం ప్రత్యేకం. పవన్‌ను స్టార్‌ను చేసిన సినిమా ఇది. అంతేకాకుండా లవ్ స్టోరీలకు నూతన అర్థాన్ని ఇచ్చిన చిత్రం. కుటుంబ బంధాలతో ముడిపెడుతూ.. ప్రేమ కథను సరికొత్తగా చెప్పిన సినిమా ఇది. 1998లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలుగా పవర్ స్టార్ యాక్టింగ్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూద్దామనుకునేవారికి తొలి ప్రేమ బెస్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఖుషి..

ప్రేమ కథల్లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసిన సినిమా ఖుషి. 2001లో విడుదలైన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ఎంతో మంది అనుకరిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో. ఇందులో పవన్ మేనరిజం, స్టైల్, లుక్ ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఆయన ఫైట్లు గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంత కొత్తగా ఉంటాయి. భూమికా చావ్లా హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. పవర్ స్టార్ ఇందులో తన యాక్టింగ్‌తో వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పవచ్చు. అందుకే ఈ సినిమాను కన్నడ, హిందీలో కూడా రీమేక్ చేశారు. ఇంక మణిశర్మ అందించిన సంగీతం, పాటల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాటలు ఇప్పటికీ ఎంతో వినసొంపుగా ఉంటాయి.

గబ్బర్ సింగ్..

ఖుషి సినిమా తర్వాత పవర్ స్టార్‌కు పదేళ్ల పాటు సరైన హిట్ పడలేదు. బాక్సాఫీస్ బద్దలు కొట్టే సినిమా పవన్‌కు దక్కాలని అభిమానులు కోరుకుంటున్న వేళ.. గబ్బర్ సింగ్‌ వచ్చి వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కినప్పటికీ తెలుగు నెటివిటీకి తగినట్లుగా కథలో మార్పులు, కామెడీ సన్నివేశాలు జోడించడంతో సినిమా కమర్షియల్‌గా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంక ఇందులో పవర్ స్టార్ పర్ఫార్మెన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన శైలి కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, సెంటిమెంట్ సన్నివేశాల్లో జీవించేశారు. అందుకే ఇప్పటికీ అభిమానులు పవర్‌స్టార్‌కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ కావాలని కోరుకుంటారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయిక.

అత్తారింటికి దారేది..

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు పవర్ స్టార్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్ తోడై ఈ సినిమా రెట్టింపు విజయాన్ని అందుకుంది. 2013లో విడుదలైన ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా చేసింది. విడుదలకు ముందే దాదాపు 90 నిమిషాల సినిమా బయటకు లీకైనప్పటికీ.. అత్తారింటికి దారేది అద్భుత విజయాన్ని అందుకోవడం విశేషం. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రాల్లో అత్తారింటికి దారేది కూడా ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో పవర్‌స్టార్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

భీమ్లా నాయక్..

అజ్ఞాతవాసి పరాజయం తర్వాత.. కాస్త గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని అందుకుంది. అయితే పవర్‌స్టార్ అభిమానులు కోరుకున్న పవర్ ప్యాక్ యాక్షన్, మాస్ మసాలా సన్నివేశాలు ఇందులో లేకపోవడంతో వారు కాస్త నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో భీమ్లా నాయక్‌తో అభిమానుల కోరికను తీర్చారు పవన్. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదిరిపోయే వసూళ్లను సాధించింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. బాక్సాఫిస్ సూపర్ సక్సెస్ అందించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలను అందుకుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం