Sankranthi Movies OTT Release Dates: సంక్రాంతి సినిమాలు ఏ ఓటీటీలో రిలీజ్ కానున్నాయంటే
23 February 2023, 5:57 IST
OTT Releases This Week: ఈ వారం చిరంజీవి, బాలకృష్ణతో పాటు పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఆ వీక్‌లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవంటే...
చిరంజీవి,
OTT Releases This Week:
వారిసు (Varisu)
దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమా ఫిబ్రవరి 22 నుంచి అమెజాన్ ప్రైమ్ తో పాటు సన్నెక్స్ట్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో డబ్బింగ్ అయ్యింది. మనస్పర్థల వల్ల విడిపోయిన తన కుటుంబాన్ని ఏకం చేసిన ఓ యువకుడి కథతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. వారిసు సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. వారిసు సినిమాను దిల్‌రాజు నిర్మించారు.
బాలకృష్ణ వీరసింహారెడ్డి(Balakrishna Veerasimha reddy)
వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఫిబ్రవరి 23 నుంచి (నేడు) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
రాయలసీమ ఫ్యాక్షనిజానికి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని జోడించి యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హనీరోజ్ కీలక పాత్రల్ని పోషించారు.
మైఖేల్
సందీప్‌కిషన్ హీరోగా నటించిన మైఖేల్ సినిమా ఫిబ్రవరి 24న ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇరవై రోజుల తర్వాతే ఓటీటీలోకి రాబోతున్నది.
వాల్తేర్ వీరయ్య (Waltair Veerayya)
చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. రవితేజ మరో హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తన సోదరుడి మరణానికి కారణమైన మాఫియా లీడర్‌పై రివేంజ్ తీర్చుకునే ఓ అన్నయ్య కథతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకుడు బాబీ...వాల్తేర్ వీరయ్య సినిమాను తెరకెక్కించారు.
పులిమేక వెబ్‌సిరీస్
ఆదిసాయికుమార్, లావణ్య త్రిపాఠి డిజిటల్ లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన తెలుగు వెబ్‌సిరీస్ పులిమేక జీ5 ఓటీటీలో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. పోలీసులను టార్గెట్ చేసిన ఓ సైకో కిల్లర్‌ను కిరణ్ ప్రభ అనే పోలీస్ ఆఫీసర్ ఓ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌తో కలిసి ఎలా పట్టుకుందన్నదే ఈ సిరీస్ కథ. చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను కోన వెంకట్ నిర్మించారు.
నాన్పకల్ నేరత్తు మయక్కం
అగ్ర హీరో మమ్ముట్టి , డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసరీ కలయికలో మొదటిసారి రూపొందిన మలయాళ చిత్రం నాన్పకల్ నేరత్తు మయక్కం ఫిబ్రవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దైవభక్తి, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది.
పాట్లక్ సీజన్ 2 - ఫిబ్రవరి 24- సోని లివ్
వాల్వి - జీ5
రాబియా అండ్ ఒలివియా - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ఇతర సినిమాలు, సిరీస్‌లు
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 3
ది స్ట్రాస్
వి హావ్ ఏ గోస్ట్
కాల్ మీ చిహిరో
ఫార్ములా వన్ డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్ 5
ట్రిప్టిచ్