Rajinikanth - Veera Simha Reddy: బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాపై కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. వీరసింహారెడ్డి సినిమా చూసిన రజనీకాంత్ తనకు ఫోన్ చేసి అభినందించారని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా ఆయనకు ఎంతగానో నచ్చిందని గోపీచంద్ మలినేని ఈ ట్వీట్‌లో తెలిపాడు.,వీరసింహారెడ్డిని ప్రశంసిస్తూ రజనీకాంత్ చెప్పిన మాటలు, సినిమా చూసిన తర్వాత ఆయనలో కలిగిన ఉద్వేగం..ఇంతకంటే గొప్ప ఆనందం తనకు ఏదీ లేదనిపిస్తోంది అంటూ గోపీచంద్ మలినేని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు. గోపీచంద్ మలినేని ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.,వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజైంది. రాయలసీమ నేపథ్యానికి అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌ను జోడించి గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో తండ్రీకొడుకులుగా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు.,శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణ సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపించింది. అఖండ తర్వాత వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసిన బాలకృష్ణ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది., ,