Nani 30 Launched: నాని కొత్త సినిమా షురూ.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి-nani new movie nani 30 launched today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani New Movie Nani 30 Launched Today

Nani 30 Launched: నాని కొత్త సినిమా షురూ.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

Maragani Govardhan HT Telugu
Jan 31, 2023 01:38 PM IST

Nani 30 Launched: నేచురల్ స్టార్ నాని మరో చిత్రాన్ని మొదలుపెట్టేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.

నాని సినిమాకు క్లాప్‌నిస్తున్న చిరంజీవి
నాని సినిమాకు క్లాప్‌నిస్తున్న చిరంజీవి

Nani 30 Launched: నేచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే దసరా సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన నాని.. ఇప్పుడు మరో చిత్రంతో రెడీ అవుతున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుంది. Nani 30 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును మేకర్స్‌కు అందజేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ఠ, వివేక్ ఆత్రేయ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రేపటి నుంచి అంటే బుధవారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను వీడియో రూపంలో చిత్రబృందంలో విడుదల చేసింది. ఈ వీడియోపై అభిమానులు, సినీ ప్రియుల నుంచి విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. ఇది వైవిధ్యమైన కథతో రానున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అనిపిస్తోంది. తండ్రి-కూతుళ్ల మధ్య ఉన్న బాండింగ్‌ను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది.

నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది. మలయాళ సినిమా హృదయం లాంటి సూపర్ హిట్‌కు సంగీతాన్ని సమకూర్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ వీడియో కోసం రూపొందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరే అద్భుతంగా ఉంది. మంచి ఫీల్ గుడ్‌ను, పాజిటివీ వైబ్‌ను ఇస్తుంది. సాను జాన్ వర్గీస్ ఐఎస్‌సీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ తర్వాత నానితో వర్గీస్ చేయనున్న మూడో సినిమా ఇదే.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్