Nani Comments : ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నా.. నాని కామెంట్స్-actor nani sensational comments about his dasara movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani Comments : ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నా.. నాని కామెంట్స్

Nani Comments : ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నా.. నాని కామెంట్స్

Anand Sai HT Telugu
Jan 30, 2023 08:30 PM IST

Nani Dasara Teaser Release : నాని హీరోగా వస్తున్న చిత్రం దసరా. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై.. ఆకట్టుకుంటోంది. టీజర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నాని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

దసరా టీజర్ లాంచ్ ఈవెంట్
దసరా టీజర్ లాంచ్ ఈవెంట్

నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కథనాయకుడిగా వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ దసరా(Dasara). టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.

'దసరా నాకు చాలా స్పెషల్ మూవీ. మార్చి 30 న అందరూ దసరా గురించి మాట్లాడుకుంటారు. అది తప్పితే మరో టాపిక్ వుండదు. తెలుగు సినిమా గురించి నా కాంట్రిబ్యూషన్ ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. చాలా గర్వంగా ఒక మాట చెబుతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుండి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్.. శ్రీకాంత్ ఓదెల. అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోతుంది.. నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. గత ఏడాది తెలుగు సినిమా నుండి ఆర్ఆర్ఆర్ వచ్చింది. కన్నడ నుండి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. 2023లో తెలుగు సినిమా నుంచి వస్తుంది దసరా. సినిమా విడుదల తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. మార్చి 30 థియేటర్ లో కలుద్దాం.' అని నాని అన్నాడు.

దసరా టీజర్(Dasara Teaser) చూస్తే.. అదిరిపోయింది. నాని క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉన్నాయి. టీజర్ చివరిలో నాని తన వేలును కత్తికి రాస్తూ.. రక్తం నుదుటిపై పెట్టుకునే శాట్ సూపర్ గా ఉంది.

బొగ్గుగని బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో పక్కా మాస్ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఊర మాస్ లుక్ లో నాని కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్(Keerthy Suresh) కథానాయిక. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ ద‌స‌రా చిత్రానికి మ్యూజిక్‌ అందించాడు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. మార్చి 30వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

టాపిక్