Michael Movie Collections: సందీప్ కిష‌న్ మైఖేల్ మూవీ క‌లెక్ష‌న్స్ - బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత క‌లెక్ట్ చేయాలంటే-sundeep kishan michael movie 2 days collection worldwide break even details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Michael Movie Collections: సందీప్ కిష‌న్ మైఖేల్ మూవీ క‌లెక్ష‌న్స్ - బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత క‌లెక్ట్ చేయాలంటే

Michael Movie Collections: సందీప్ కిష‌న్ మైఖేల్ మూవీ క‌లెక్ష‌న్స్ - బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత క‌లెక్ట్ చేయాలంటే

Nelki Naresh Kumar HT Telugu
Feb 05, 2023 04:15 PM IST

Michael Movie Collections: సందీప్ కిష‌న్ మైఖేల్ మూవీ రెండు రోజుల్లో దాదాపు ఆరు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత క‌లెక్ట్ చేయాలంటే...

సందీప్ కిష‌న్ దివ్యాంశ‌ కౌషిక్‌
సందీప్ కిష‌న్ దివ్యాంశ‌ కౌషిక్‌

Michael Movie Collections: ఫ‌స్ట్ పాన్ ఇండియ‌న్ మూవీ మైఖేల్‌తో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు సందీప్‌కిష‌న్‌. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న‌ది. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద మైఖేల్ డీసెంట్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా 6.25 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం.

తొలిరోజు దాదాపు మూడు కోట్ల 55 ల‌క్ష‌ల గ్రాస్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు రెండు కోట్ల డెబ్భై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త‌మిళంలో రెండు రోజుల్లో ఈ సినిమా కోటిన్న‌ర వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఓవ‌రాల్‌గా రెండో రోజుల్లో ఈ సినిమా ఆరు కోట్ల ఇర‌వై ఐదు ల‌క్ష‌ల గ్రాస్, మూడు కోట్ల కుపైగా షేర్‌ను సొంతం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. సందీప్ కిష‌న్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆరున్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఏడు కోట్లు క‌లెక్ట్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌గా నిలుస్తుంది.

అంటే మ‌రో మూడు కోట్ల ఎన‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాల్సి ఉంది. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ మీన‌న్ వ‌రుణ్ సందేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

గ్యాంగ్‌స్ట‌ర్ కావాల‌నే ల‌క్ష్యంతో ముంబాయిలో అడుగుపెట్టిన ఓ యువ‌కుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు రంజిత్ జ‌య‌కోడి ఈ సినిమాను తెర‌కెక్కించారు. దివ్యాంక కౌషిక్ హీరోయిన్‌గా న‌టించ‌గా అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టించింది.

IPL_Entry_Point