తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Trailer: యూట్యూబ్‌లో ట్రెండింగ్ గా లైగ‌ర్ ట్రైల‌ర్‌-రెండు రోజుల్లో ఎన్ని మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయంటే

Liger trailer: యూట్యూబ్‌లో ట్రెండింగ్ గా లైగ‌ర్ ట్రైల‌ర్‌-రెండు రోజుల్లో ఎన్ని మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయంటే

HT Telugu Desk HT Telugu

23 July 2022, 19:16 IST

  • విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) హీరోగా న‌టించిన లైగ‌ర్ ట్రైల‌ర్ (liger trailer) సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే ఈ ట్రైల‌ర్‌కు యూట్యూబ్‌లో ఎన్ని మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయో తెలుసా...

లైగ‌ర్ ట్రైల‌ర్
లైగ‌ర్ ట్రైల‌ర్ (twitter)

లైగ‌ర్ ట్రైల‌ర్

liger trailer: లైగ‌ర్ సినిమాతో దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత ప్రేక్ష‌క‌లు ముందుకు రాబోతున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటీవ‌ల ఈ సినిమా తెలుగుతో పాటు బాలీవుడ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. గురువారం విడుద‌ల‌చేసిన ఈ ట్రైల‌ర్‌కు 48 గంట‌ల్లోనే యాభై రెండు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Manjummel Boys OTT: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

హిందీ ట్రైల‌ర్‌కు 34 మిలియ‌న్ల వ్యూస్ రాగా తెలుగు ట్రైల‌ర్ 18 మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను రాబ‌ట్టింది. 2022లో త‌క్కువ టైమ్‌లోనే అత్య‌ధిక వ్యూస్‌ను రాబ‌ట్టిన ట్రైల‌ర్‌ల‌లో ఒక‌టిగా లైగర్ నిలిచింది. తెలుగు ట్రైల‌ర్ కంటే హిందీ ట్రైల‌ర్‌కు అత్య‌ధిక వ్యూస్ రావ‌డం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్ గా మారింది. హిందీలో విజ‌య్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు ఈ ట్రైలర్ నిద‌ర్శ‌న‌మిద‌ని అత‌డి అభిమానులు చెబుతున్నారు.

ట్రైల‌ర్‌కు వ‌స్తోన్న రెస్పాన్స్ ప‌ట్ల విజ‌య్ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ట్రైల‌ర్ ను ఉద్దేశిస్తూ ర‌మ్య‌కృష్ణ చేసిన ట్వీట్ కు విజ‌య్ స్పందిస్తూ లైగ‌ర్ ట్రైల‌ర్ తో ఇండియా మొత్తాన్ని మ‌నం షేక్ చేసిన‌మ్ అంటూ పేర్కొన్నాడు. లైగ‌ర్ సినిమాతోనే విజ‌య్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. తెలుగు,హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో ఆగ‌స్ట్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది. అన‌న్యాపాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌ర‌ణ్ జోహార్‌,అపూర్వ మెహ‌తాల‌తో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్‌,ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.