తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Trailer Telugu: లైగ‌ర్ ట్రైల‌ర్ వచ్చేసింది...విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌

liger trailer telugu: లైగ‌ర్ ట్రైల‌ర్ వచ్చేసింది...విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌

HT Telugu Desk HT Telugu

21 July 2022, 9:34 IST

  • విజ‌య్‌దేవ‌ర‌కొండ (vijay devarakonda) హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం లైగ‌ర్‌ (liger). ఈ సినిమా ట్రైల‌ర్‌ను గురువారం రిలీజ్ చేశారు. యాక్ష‌న్ అంశాల‌తో ప‌వ‌ర్‌ఫుల్‌గా సాగిన ఈ ట్రైల‌ర్ విజ‌య్‌దేవ‌ర‌కొండ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.
విజ‌య్‌దేవ‌ర‌కొండ
విజ‌య్‌దేవ‌ర‌కొండ (twitter)

విజ‌య్‌దేవ‌ర‌కొండ

liger telugu trailer: లైగ‌ర్ ట్రైల‌ర్‌తో అభిమానుల‌ను అల‌రించారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఆగ‌స్ట్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా లైగర్ రిలీజ్ కానుంది. క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ‌మెహ‌తాల‌తో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ పాన్ ఇండియ‌న్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 15th Episode: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​- ఒక్కటైన అమర్​, భాగీ- తప్పించుకున్న సరస్వతి- నిజం తెలుసుకున్న అరుంధతి

Sudigali Sudheer: బుల్లితెర‌పైకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ - కొత్త షోకు గ్రీన్‌సిగ్న‌ల్ - టైటిల్ ఇదే!

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

గురువారం లైగర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక లయన్ కి, టైగర్ పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ అంటూ రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ తో ఆసక్తికరంగా ట్రైలర్ ప్రారంభమైంది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ పై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ లు డిఫరెంట్ గా హాలీవుడ్ శైలిలో ఉన్నాయి. యాక్షన్ అంశాలతో పాటు విజయ్, అనన్యా పాండే రొమాంటిక్ ట్రాక్ ను స్టైలిష్ గా ట్రైలర్ లో చూపించారు దర్శకుడు. ఇందులో విజయ్ నత్తి సమస్యతో బాధపడే యువకుడిగా కనిపించారు. ఐయామ్ ఏ ఫైటర్ అంటూ ట్రైలర్ చివరల్లో తడబడుతూ చెప్పే విజయ్ చెప్పే డైలాగ్ ఆసక్తిని పంచుతోంది.

ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిరంజీవి, హిందీ ట్రైల‌ర్‌ను ప్ర‌భాస్ రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తెలుగు ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ వేడుక‌ను సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిపారు. ఈ వేడుక‌లో క‌ర‌ణ్‌జోహర్‌, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మితో పాటు చిత్ర క‌థానాయిక అనాన్య‌పాండే పాల్గొన్న‌ది. ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంతో పాటు క‌న్న‌డంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం